JEE Advanced: ఈసారి కొంత కఠినంగా జేఈఈ అడ్వాన్స్‌డ్.. వారికి మాత్రమే మంచి ర్యాంకు వస్తుందంటున్న నిపుణులు
ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఆదివారం రోజున దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రాన్ని పరిశీలించి నిపుణలు ఈ పరీక్షపై తమ అభిప్రయాన్ని వ్యక్తం చేశారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ కొంత కఠినంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా గణితం, రసాయన శాస్త్రంలోని ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని.. వాటితో పాటు రుణాత్మక మార్కులు ర్యాంకింగ్‌లో కీలకంగా మారుతాయని పేర్కొన్నారు.
ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఆదివారం రోజున దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రాన్ని పరిశీలించి నిపుణలు ఈ పరీక్షపై తమ అభిప్రయాన్ని వ్యక్తం చేశారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ కొంత కఠినంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా గణితం, రసాయన శాస్త్రంలోని ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయని.. వాటితో పాటు రుణాత్మక మార్కులు ర్యాంకింగ్‌లో కీలకంగా మారుతాయని పేర్కొన్నారు. ఒక్కో పేపర్‌లో మొత్తం 51 ప్రశ్నలు ఉండగా.. ఒక్కో సబ్జెక్టుకు 17 ప్రశ్నలిచ్చారని చెప్పారు. పేపర్-1లో మడో సెక్షన్, పేపర్-2లో చివరికి రెండు సెక్షన్లకు రుణాత్మక మార్కులు లేవన్నారు. ఇందులో ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగినట్లైతేనే మంచి ర్యాంక్ వస్తుందని చెబుతున్నారు.
ఒకసారి పేపర్లను పరిశీలిస్తే పేపర్-1లో మూడో సెక్షన్‌కు 24 మార్కులుండగా వాటికి నెగిటివ్ మార్కులు లేవు. అయితే మిగిలిన మూడు సెక్షన్లకు ఒక్కో దానికి 12 మార్కులు మాత్రమేనని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం మొత్తం ఎన్ని మార్కులకో ముందుగా తెలియదని.. ఒక్కో సబ్జెక్టులో ఎన్ని సెక్షన్లు.. ఎన్ని ప్రశ్నలు.. ఏ సెక్షన్‌కు రుణాత్మక మార్కులు ఉంటాయో కూడా తెలియవని చెబుతున్నారు. అయితే ఈసారి కటాఫ్ మార్కులు సుమారు 60 గా ఉండొచ్చని తెలిపారు. 360కి 275 మార్కులు దాటితే 10 ర్యాంకులోపు.. 260 మార్కులు దాటితే 100 లోపు ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం