AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Election Commission: రాజకీయ పార్టీలకు ఊరట.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..!

దేశంలో కోవిడ్ 19 కేసుల తగ్గిముఖం పడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Election Commission: రాజకీయ పార్టీలకు ఊరట.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..!
Eci
Balaraju Goud
|

Updated on: Feb 20, 2022 | 7:41 PM

Share

Election Commission of India: దేశంలో కోవిడ్ 19(Covid 19) కేసుల తగ్గిముఖం పడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం ఆదివారం నుంచి స్టార్ క్యాంపెయినర్ల(Star Campaigners) జాబితాను వెంటనే అమలులోకి తెచ్చింది. సంఖ్యపై గరిష్ట పరిమితిని జాతీయ, రాష్ట్ర పార్టీలకు 40, గుర్తింపు పొందిన పార్టీలు కాకుండా ఇతర పార్టీలకు 20గా నిర్ణయించింది. అదనపు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటలలోపు ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని సూచించింది. కొత్త కోవిడ్ 19 యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని, మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్నాయని ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు రాసిన లేఖలో పేర్కొంది. దీంతో స్టార్ క్యాంపెయినర్ల సంఖ్య పరిమితిని పునరుద్ధరించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ప్రస్తుతం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలకు స్టార్ క్యాంపెయినర్ల గరిష్ట పరిమితి 40, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు కాకుండా ఇతర పార్టీల స్టార్ క్యాంపెయినర్ల సంఖ్య గరిష్టంగా 20గా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల 5, 6, 7 దశలు, అస్సాంలోని మజులి అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం అదనపు స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఫిబ్రవరి సాయంత్రం 5 గంటలలోపు ఎన్నికల సంఘానికి గానీ సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించాలని ఈసీ సూచించింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిన దృష్ట్యా ఈసీ.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయంలో కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. ఎన్నికల ప్రచారంలో బాగంగా బహిరంగ సభలతో పాటు, స్టార్ క్యాంపెయిన్‌పై కూడా ఆంక్షలు విధించింది. అలాగే, అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో ప్రజలు కనిపించినందున, ఎన్నికల సంఘం ముందుగా గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర పార్టీల స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను అక్టోబర్ 2020లో 40 నుండి 30కి తగ్గించింది. అదే సమయంలో, గుర్తింపు లేని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు స్టార్ క్యాంపెయినర్ల గరిష్ట సంఖ్యను 20 నుంచి 15కు తగ్గించారు. తాజాగా ఈ నిబంధనలు సడలిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also… KCR Meets Sharad Pawar:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శరద్ పవార్ ఇచ్చిన మద్దతు మర్వలేంః సీఎం కేసీఆర్