AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

B.S.Yediyurappa: మరోసారి ముఖ్యమంత్రిగా యడియూరప్ప!.. అసలు మ్యాటరేంటంటే..

దక్షిణ భారతదేశంలో బీజేపీ నుంచి మొద‌టి సారిగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు బీఎస్‌ యడియూరప్ప (B.S.Yediyurappa).

B.S.Yediyurappa: మరోసారి ముఖ్యమంత్రిగా యడియూరప్ప!.. అసలు మ్యాటరేంటంటే..
Bs Yediyurappa
Basha Shek
|

Updated on: Feb 20, 2022 | 8:48 PM

Share

దక్షిణ భారతదేశంలో బీజేపీ నుంచి మొద‌టి సారిగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు బీఎస్‌ యడియూరప్ప (B.S.Yediyurappa). కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం కన్నడ రాష్ట్రంలో కాషాయం పార్టీ అధికారంలో ఉందంటే యడియూరప్పే చలవే కారణమని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మొన్నటివరకు ఆయనే కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయితే కొన్ని కారణాలతో ఇటీవల తన ముఖ్యమంత్రి పీఠాన్ని బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) కి అప్పగించారు. ఇదిలా ఉంటే యడియూరప్ప మళ్లీ సీఎం పీఠంపూ కూర్చోనున్నారు. అయితే అది రియల్‌గా కాదు సిల్వర్‌ స్ర్కీన్‌పై. ‘తనూజ’ అనే కన్నడ మూవీలో ఈ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి నటించనున్నారు. ఈ సినిమాలో కూడా ఆయన ముఖ్యమంత్రి పాత్రలో నటించనున్నారు. ఈ మూవీని హరీష్ ఎమ్ డి హల్లి తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆయనపై కొంత భాగాన్ని షూట్‌ చేశారు.

‘తనూజ’ సినిమాలో యడ్డీ అద్భుతంగా నటించారని శాండల్ వుడ్ మీడియా చెబుతోంది. ఈ చిత్రాన్ని ‘బియాండ్ విజన్ సినిమాస్’ నిర్మిస్తోంది. బెంగళూరు, శివమొగ్గ వంటి ప్రాంతాల్లో ఈ మూవీని చిత్రీకరించారు. రవీంద్రనాథ్ సినీమాటోగ్రాఫర్‌గా, ఆర్.బి. ఉమేశ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనూజ అనే యువతి కరోనాతో నీట్ పరీక్షలను రాయలేకపోయింది. కొవిడ్‌ను జయించిన అనంతరం ఆమె ఇద్దరు జర్నలిస్టుల సహాయంతో ఆ పరీక్షను పూర్తి చేసింది. పరీక్ష రాయడానికి దాదాపుగా ఆమె 350 కిలోమీటర్లు ప్రయాణించింది. నీట్ పరీక్షలో విజయం సాధించింది. అప్పట్లో ఈ యువతి ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడీ యువతి నేపథ్యంతోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Also Read: Rakul Preet Singh: ప్రియుడితో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించిన పంజాబీ బ్యూటీ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..

India Fishermen: బుద్ధి మార్చుకోని పాక్‌.. 30 మంది భారత జాలర్లను బంధీలుగా చేసుకున్న దాయాది..

Constable Suicide: హైదరాబాద్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. కారణమేంటంటే..