Rakul Preet Singh: ప్రియుడితో కలిసి తాజ్‌మహల్‌ను సందర్శించిన పంజాబీ బ్యూటీ.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు..
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) ప్రస్తుతం బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ( Jackky Bhagnani)తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh) ప్రస్తుతం బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ( Jackky Bhagnani)తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. జాకీతో ప్రేమలో ఉన్నానంటూ గతేడాది అక్టోబర్‌లో ఆమే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రేమికులిద్దరూ కలిసి తెగ చక్కర్రలు కొడుతున్నారు. వెకేషన్లు, డిన్నర్ డేట్‌లు, పార్టీలకు జంటగానే వెళుతున్నారు. పెళ్లి గురించి ప్రస్తావిస్తే ‘ నా పెళ్లి విషయం నేనే ప్రకటిస్తాను. ప్రస్తుతం సినిమాలపైనే నా దృష్టి’ అంటూ రుసరుసలాడింది. దీంతో ఇప్పట్లో వీరిద్దరూ పెళ్లిచేసుకోరని తెలుస్తోంది. తాజాగా ప్రపంచ ఏడు వింతల్లో ఒకటి, ప్రేమకు ప్రతిరూపమైన తాజ్ మహల్ (TajMahal) ను సందర్శించారీ లవ్ బర్డ్స్. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా రకుల్, అజయ్ దేవ్‌గణ్‌తో ‘దే దే ప్యార్ దే’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు లవ్ రంజన్ వివాహం ఢిల్లీలో జరిగింది. ఈ వేడుకలకు రకుల్, జాకీతో సహా రణ్‌బీర్ కపూర్, అర్జున్ కపూర్, శ్రద్ధా కపూర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈనేపథ్యంలోనే రకుల్, జాకీలు తాజ్ మహల్‌ను సందర్శించారని తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది ‘కొండపొలం’ లో నటించింది రకుల్. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగన్‌తో ‘రన్‌వే 34’, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘డాక్టర్ G’, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి ‘అటాక్’ అనే సినిమాలు చేస్తోంది . వీటితో పాటు ‘థ్యాంక్ గాడ్’, ‘ఛత్రీవాలీ’, ‘మిషన్ సిండ్రెల్లా’ సినిమాలకు కూడా అంగీకారం తెలిపింది.
View this post on Instagram
View this post on Instagram
Also Read:Andhra Pradesh: ఉద్యోగుల కొత్త పీఆర్‌సీ అమలు ఉత్తర్వుల విడుదల.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు ఎలా ఉన్నాయంటే..