Andhra Pradesh: ఉద్యోగుల కొత్త పీఆర్‌సీ అమలు ఉత్తర్వుల విడుదల.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు ఎలా ఉన్నాయంటే..

ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవోలను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.

Andhra Pradesh: ఉద్యోగుల కొత్త పీఆర్‌సీ అమలు ఉత్తర్వుల విడుదల.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు ఎలా ఉన్నాయంటే..
Ap Govt
Follow us
Basha Shek

|

Updated on: Feb 20, 2022 | 7:03 PM

ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవోలను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఒప్పందం ప్రకారం ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌ఓడీ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏను వర్తింప చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 2022 జనవరి 1 వ తేదీ నుంచి హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా పీఆర్సీలో మొదట 16 శాతం మేర మాత్రమే హెచ్‌ఆర్‌ఏ పెంపు సిఫార్సు చేసినప్పటికీ, మంత్రుల కమిటీతో కుదిరిన ఒప్పందం మేరకు 24 శాతం వర్తింప చేస్తూ కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా హెచ్‌ఆర్‌ఏ గరిష్ఠ పరిమితి రూ. 25 వేలకు నిర్ధారిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏపీ భవన్‌, హైదరాబాద్‌లలో పనిచేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా 2.50లక్షల జనాభా ఉన్న పట్టణాలు, 13 జిల్లా కేంద్రాల్లో బేసిక్‌ పే పైన 16 శాతం హెచ్‌ఆర్‌ఏ లేదా రూ.17వేల సీలింగ్‌ను నిర్ణయించారు. అదేవిధంగా 2 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ నిర్ధారణ రూ.13 వేలకు మించకుండా సీలింగ్‌ విధించారు. ఇక 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 10 శాతం లేదా 11 వేల రూపాయలు మించకుండా హెచ్‌ఆర్‌ఏ ఇవ్వనున్నారు.

కాగా పీఆర్సీ ఉత్తర్వులతో పాటు 2022 ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతన, పెన్షన్‌ బిల్లులను సిద్ధం చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఓడీలు, సచివాలయ ఉద్యోగులకు, విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు సిటీ కంపన్సేటరీ అలవెన్సును కూడా నిర్ధారిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇక పెన్షన్‌ చెల్లింపుల్లో 70 ఏళ్లు దాటిన వారికి క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ అమలులో మార్పులు చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.

Also Read:Bad Habits: ఈ 5 అలవాట్లు మానకుంటే ఆర్థికంగా చితికిపోతారు.. అవేంటంటే..?

Snake Gourd-Egg: పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే పాయిజన్ అవుతుందా? ఇదిగో క్లారిటీ

UP Elections: ‘బాబా జీ కొత్త పేరు, బాబా బుల్డోజర్’.. అయోధ్యలో సీఎం యోగిపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు!