EC on Counting: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కొత్త నిబంధనలు.. ఆ సర్టిఫికేట్ ఉంటేనే కౌటింగ్‌కు అనుమతి!
నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది.
ECI on Election Counting:నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల కమిషన్ (ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. మే 2న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. కౌటింగ్ రోజుతో పాటు అనంతరం జరిగే అన్ని విజయోత్సవ ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లాలనుకునే అభ్యర్థులు, వారి ఏజెంట్లు కరోనా నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లేదంటే రెండు డోసుల టీకా తీసుకున్నట్లు ధృవీకర పత్రాన్ని చూపించాలని సూచించింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి చూపిస్తేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని పేర్కొంది.
అయితే, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే కంటే 48 గంటల ముందు చేయించినది అయి ఉండాలని నిబంధన విధించింది. అంతకంటే ముందు రిపోర్టు చూపించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అభ్యర్థులతో పాటు వారి ఏజెంట్లు ఈ నిబంధన పాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి శాసన సభలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లో చివరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగుతుంది. మే 1న అభ్యర్థులకు, వారి తరపు కౌంటింగ్ ఏజెంట్లకు ఆర్‌టీ పీసీఆర్ /ఆర్ఏటీ టెస్టులు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేస్తారని ఈసీ తెలిపింది. ఈ పరీక్షలు చేయించుకొనని అభ్యర్థులను, కౌంటింగ్ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించేది లేదని తెలిపింది. లేదంటే కోవిడ్ 19 నిరోధక వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నట్లు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని వెల్లడించింది.
Election Commission makes it mandatory for candidates and their agents to show negative RT-PCR test reports or complete vaccination reports to enter counting centres pic.twitter.com/RtMfAhgi76
— ANI (@ANI) April 28, 2021
Read Also… కరోనాతో నా కుటుంబం పోరాడింది.. చాలా భయమేసింది.. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి… అవికా గోర్ ట్వీట్..