SBI Customers Alert: కస్టమర్లు ఎట్టి పరిస్థితుల్లో క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయవద్దు: ఎస్‌బీఐ
SBI Customers Alert: కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో క్యూఆర్ కోడ్‌లను వినియోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను..
SBI Customers Alert: కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయికి చేరుకున్న నేపథ్యంలో క్యూఆర్ కోడ్‌లను వినియోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను కోరింది. రాత్రి వేళల్లో ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలను నిర్వహించాల్సిన సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. లేనిపక్షంలో… బ్యాంకు ఖాతాలోని నగదు సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు సురక్షితమైన బ్యాంకింగ్ పద్ధతులకు సంబంధించి తన కస్టమర్ లకు హెచ్చరికలు, ట్యుటోరియల్స్, సమాచారాన్ని విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతోన్న నేపథ్యంలో.. వారి ఉచ్చులో పడకుండా ఉండటానికి ఎస్‌బీఐ తన వినియోగదారులను హెచ్చరిస్తోంది. క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయవద్దని కోరింది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినప్పుడు.. డబ్బు రాకపోగా మీ బ్యాంక్ ఖాతా నుండి సదరు సైబర్ నేరగాడికి ఖాతాలో నగదు చేరిపోతుందని హెచ్చరించింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయాలని కూడా కోరింది.
కాగా, ఈ మధ్య కాలంలో రోజురోజుకు సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఎస్‌బీఐ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ ఏటీఎం బ్లాక్ అయిందంటూ, అలాగే ఓటీపీలు, బ్యాంకు ఖాతా నెంబర్ చెప్పాలని ఇలా రకరకాలుగా నేరగాళ్లు కస్టమర్లకు ఫోన్‌లు చేస్తూ వారి నుంచి బ్యాంకుకు సంబంధించి వివరాలు రాబట్టుకుని అకౌంట్లో నుంచి డబ్బులను తస్కరిస్తున్నారు. ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. అందుకే ఎస్‌బీఐ కూడా తన కస్టమర్లకు రోజురోజుకు హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తోంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ముందస్తుగా తగు సూచనలు చేస్తోంది.
QR कोड स्कैन न करें और धोखाधड़ी से सुरक्षित रहें। जब आप QR कोड को स्कैन करते हैं, तो आपको धनराशि नहीं मिलती। जब तक आपका उद्देश्य किसी को भुगतान करना नहीं है, तब तक किसी के द्वारा साझा किए गए QR कोड को स्कैन न करें।#CyberCrime #StayAlert #StaySafehttps://t.co/upWnKPo3AX
— State Bank of India (@TheOfficialSBI) April 28, 2021
ఇవీ చదవండి: