సైకిలుపై భార్య మృతదేహం, అంత్యక్రియలు జరపకుండా వృద్దుడిని అడ్డుకున్నగ్రామస్థులు
మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందనడానికి ప్రతీక ఈ ఘటన. .యూపీ లోని జౌన్ పూర్ లో మరణించిన తన భార్య మృతదేహాన్ని అంత్యక్రియలకు సైకిలుపై తీసుకువెళ్తున్న పేద వృద్దుడిని గ్రామస్థులు అడ్డగించారు.
మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందనడానికి ప్రతీక ఈ ఘటన. .యూపీ లోని జౌన్ పూర్ లో మరణించిన తన భార్య మృతదేహాన్ని అంత్యక్రియలకు సైకిలుపై తీసుకువెళ్తున్న పేద వృద్దుడిని గ్రామస్థులు అడ్డగించారు. కరోనా వైరస్ భయంతో ఆమె అంత్యక్రియలను అనుమతించేది లేదని వారు ఖరాఖండిగా చెప్పారు. దీంతో గంటలతరబడి తన సైకిలును, భార్య మృతదేహాన్ని వదిలేసి ఆ వృధ్ధుడు అక్కడే కూర్చుండిపోయాడు. ఆయనను ఆదుకునేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. బహుశా అతనికికూడా కోవిడ్ సోకి ఉండవచ్చునని గ్రామస్థులు కనీసం అతని సమీపానికి కూడా రాలేదు. రోడ్డు మధ్యే కింద పడిన సైకిల్, అక్కడే అతని భార్య మృతదేహం ఉండిపోయాయి. చివరకు పోలీసులకు ఈ సమాచారం తెలిసి వారే వచ్చి ఆ నిర్భాగ్యురాలి డెడ్ బాడీకి అంత్యక్రియలు నిర్వహించారు.
జౌన్ పూర్ లోని అంబర్ పూర్ గ్రామంలో జరిగిందీ ఘటన. కొంతకాలంగా అస్వస్థురాలిగా ఉన్న తన భార్యను ఆ వృధుడు అతి కష్టం మీద ఆసుపత్రికి తీసుకు వెళ్లాడని, కానీ ఆసుపత్రిలో ఆమె మరణించిందని తెలిసింది. ఆమె మృతదేహాన్ని అతనికి అప్పగించే సమయానికే ఆ డెడ్ బాడీ చాలావరకు కుళ్ళి పోయి ఉందని తెలిసింది. ఈ సంఘటన తాలూకు ఫోటోలను కొందరు సోషల్ షేర్ చేస్తూ అధికారుల తీరును, గ్రామస్థుల అమానుషత్వాన్ని ఖండించారు. దేశంలోని మారుమూల గ్రామాల్లో ఇంకా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయని, కానీ అవి వెలుగులోకి రావడంలేదని తెలుస్తోంది. ఢిల్లీలో నిన్న ఆటో లోనే తన కన్న కొడుకు ముందే ఓ తల్లి ప్రాణాలు వదిలింది. కోవిడ్ రోగి అయిన ఆమెను బెడ్స్ లేని కారణంగా అడ్మిట్ చేసుకోవడానికి అక్కడి ఆసుపత్రి అధికారులు నిరాకరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: AP Inter Exams: మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్
CoWIN Crashed: ప్రారంభమైన టీకా రిజిస్ట్రేషన్.. పోర్టల్ క్రాష్.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు