కరోనాతో నా కుటుంబం పోరాడింది.. చాలా భయమేసింది.. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి… అవికా గోర్ ట్వీట్..
Avika Gor: హిందీలో తెరకెక్కిన బాలికా వధు సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచమైంది అవికా గోర్. ఇదే సీరియల్ తెలుగులో
Avika Gor: హిందీలో తెరకెక్కిన బాలికా వధు సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచమైంది అవికా గోర్. ఇదే సీరియల్ తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు పేరుతో డబ్బింగ్ అయ్యింది. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు ఆనందిగా, ఓ చిన్నారి పెళ్ళికూతురిగా అవికా ఎంతో దగ్గరైంది. ఇక ఆ సీరియల్ తర్వాతా యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన ఉయ్యాల, జంపాలా సినిమాతో హీరోయిన్ గా కనిపించి మెప్పించింది. ఈ మూవీ తర్వాత సినిమా చూపిస్తా మామ, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజుగారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అవికాగోర్. ఇటీవల తన ప్రియుడిని కూడా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. మిలింద్ చంద్వానీతో ప్రేమలో ఉన్నానని, కానీ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోమని తేల్చి చెప్పింది. తాజాగా ఈ అమ్మడు కరోనా సృష్టిస్తున్న పరిస్థితులను చూసి భయపడుతోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది.
బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ వైరస్ వల్ల 2 లక్షల మంది చనిపోయారు. కానీ ఈ సంఖ్య నాలుగైదు రెట్లు ఎక్కువగానే ఉండి ఉంటుంది. 17 మిలియన్ల మంది వైరస్ బారిన పడ్డారు. వారిలో చాలామంది భవిష్యత్తులోనూ అనారోగ్యంతో బాధపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడం వైద్యారోగ్య సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది. కాబట్టి ఈ వైరస్ నియంత్రించడానికి మనం కూడా చేయగలిగేదంతా చేద్దాం. నా కుటుంబం కూడా దీనితో పోరాడింది. నాకు చాలా భయమేసింది. కానీ ఇందులో వాళ్ళు విజయం సాధించారు. కానీ ఎవరికీ ఇలాంటి పరిస్థితులు రావద్దు. కరోనాను జయించిన వారు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రండి. అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి. ఇది మిమ్మల్ని వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది. మిమ్మల్ని వేడుకుంటున్నాను… అత్యవసరమైతేనే కాలు బయట పెట్టండి, ఇంట్లోనే ఉండండి. మనందరం ఏకమై దానితో పోరాడుదాం. ఇప్పటికే ఒకసారి జయించాం. మరోసారి గెలుస్తామన్న నమ్మకం కూడా ఉంది. నేను మీకు మాటిస్తున్నా.. కరోనా నుంచి విముక్తి కోసం నాకు చేతనైనంత కృషి చేస్తాను” అని అవికా గోర్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపింది.
Also Read: F3 Movie: సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. ఎఫ్ 3 సినిమా విడుదలయ్యేది అప్పుడేనా..