AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana: ఫుల్లుగా తాగి బార్ లో డ్యాన్సులు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో స్క్రీన్ పై రామాయణం వీడియో..

దేశంలో రామయణాన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తారు. చాలామంది రాముడ్ని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. అయితే ఉత్తరప్రదేశ్ నోయిడాలో మాత్రం ఓ బార్ లోపల ఉన్న స్క్రీన్ పై రామయణం టీవీ సిరియల్ వేయడం అందరిని ఆగ్రహానికి గురి చేస్తోంది.

Ramayana: ఫుల్లుగా తాగి బార్ లో డ్యాన్సులు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో స్క్రీన్ పై రామాయణం వీడియో..
Ramayana Serial Video
Aravind B
|

Updated on: Apr 11, 2023 | 8:44 AM

Share

దేశంలో రామయణాన్ని పవిత్ర గ్రంథంగా భావిస్తారు. చాలామంది రాముడ్ని ఆరాధ్య దైవంగా కొలుస్తారు. అయితే ఉత్తరప్రదేశ్ నోయిడాలో మాత్రం ఓ బార్ లోపల ఉన్న స్క్రీన్ పై రామయణం టీవీ సిరియల్ వేయడం అందరిని ఆగ్రహానికి గురి చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే నోయిడాలోని గార్డెన్స్ గల్లేరియా మాల్ లో ఉన్న లార్డ్ ఆఫ్ ది డ్రింక్స్ బార్ లో కొంతమంది తాగి డ్యాన్సులు చేస్తున్నారు. అక్కడ్నే ఓ స్రీన్ పై వీడియోలు కూడా ప్లే చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా వెనకనుంచి మ్యూజిక్ వస్తుండగానే రాముడు, రావణుడు కనిపించేలా రామయణం సీరియల్ వీడియో వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై నెటీజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బార్ యజమానులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆ బార్ ను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై స్పందించిన నోయిడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ రెస్టో-బార్ యజమానిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో మరో ముగ్గురిపై కేసు నమోదు చేశామని కాని వారిలో ఎవరిని ఇంతవరకు అరెస్టు చేయలేదని నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ శక్తి అవస్తి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.