Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌.. కేంద్రంపై బీఆర్‌ఎస్‌ విసుర్లు.. ఏపీ సర్కార్‌పైనా గురి..

విశాఖ తీరంలో పోటెత్తిన ఉక్కుకెరటాలు.. తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్‌ను కుదిపేస్తున్నాయి. ఓవైపు పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం కసరత్తు చేస్తుంటే.. వీలైతే అడ్డుకుంటాం.. లేదంటే బిడ్డింగ్ వేస్తాం అంటోంది తెలంగాణ పాలకపక్షం. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలోకి BRS ఎంట్రీతో ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్‌ హీట్‌ రాజుకుంది. కేంద్రంపై విసుర్లు.. ప్రభుత్వాల మధ్య మాటల వేడి.. విపక్షాల కౌంటర్లతో కంప్లీట్ పొలిటికల్ టర్న్ తీసుకుంది.

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌.. కేంద్రంపై బీఆర్‌ఎస్‌ విసుర్లు.. ఏపీ సర్కార్‌పైనా గురి..
Vizag Steel Plant
Follow us

|

Updated on: Apr 10, 2023 | 10:04 PM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలోకి BRS ఎంట్రీతో ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్‌ హీట్‌ రాజుకుంది. కేంద్రంపై విసుర్లు.. ప్రభుత్వాల మధ్య మాటల వేడి.. విపక్షాల కౌంటర్లతో సమస్య రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ అంశాన్ని టేకప్‌ చేయడం వెనుక BRS వ్యూహం ఏంటనే చర్చా జరుగుతోంది. విశాఖ ఉక్కు… రాజకీయ పార్టీలకు కిక్కు ఇస్తోందా..? తెలంగాణలో అధికారంలో ఉన్న BRS జోక్యంతో సమస్య పొలిటికల్‌ టర్న్‌ తీసుకుందా..? ఈ ప్రశ్నల చుట్టూనే ప్రస్తుతం ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. రెండేళ్లుగా స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ఏపీ BRS నేతలు విశాఖ వచ్చి మద్దతిచ్చారు. ప్రైవేటీకరణ కోసం చేపట్టిన బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్‌ నిర్ణయించిన తరుణంలో గులాబీ పార్టీ నేతల రాక.. కాక రేపుతోంది. కేంద్రం చర్యల వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించిన ఏపీ BRS అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌.. స్టీల్‌ప్లాంట్‌ భూములు అదానీకి దోచిపెట్టడానికే అని తేల్చేశారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో బీఆర్ఎస్ తీరును ఏపీ బీజేపీ తప్పుపట్టింది. ఏపీ సీపీఐ మాత్రం తెలంగాణ సర్కార్‌ చర్యలను ప్రస్తావిస్తూనే.. వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది. స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ తీరును ప్రశ్నించారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

ఏపీలో పాగా వేసేందుకు బీఆర్‌ఎస్‌ రాజకీయ ఎత్తుగడ..? ఇంతకీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమంలోకి బీఆర్ఎస్‌ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది..? విశాఖ ఉక్కు ప్రైవేట్‌ పరం కాకుండా అడ్డుకునే ఆలోచనా.. లేక ఈ అంశం ఆధారంగా ఏపీలోనూ బీఆర్‌ఎస్‌ పాగా వేసే రాజకీయ ఎత్తుగడ ఉందా..? స్టీల్‌ ప్లాంట్‌ దాదాపు 30 వేల మంది కార్మికులతో ముడిపడి ఉన్న అంశం కావడంతో బీఆర్ఎస్‌ వేగంగా పావులు కదుపుతున్నట్టు ఏపీలోని పార్టీలు అనుమానిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!