Heatwave Alert: ఏపీ ప్రజలూ.. వచ్చే రెండు రోజులు జాగ్రత్త.. ఈ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం
రోజురోజుకీ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం...
రోజురోజుకీ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఏప్రిల్ 11, 12వ తేదీల్లో రాష్ట్రంలోని పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మంగళవారం మొత్తం 26 మండలాల్లో, బుధవారం 69 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడ్డతీగల, నెల్లిపాక, చింతూరు, గంగవరం, రాజవొమ్మంగి, వరరామచంద్రపురం మండలాలు. అనకాపల్లి జిల్లాలో కోటవురట్ల, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం మండలాలు. తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరం, సీతానగరం, గోకవరం, కోరుకొండ మండలాలు. ఏలూరు జిల్లాలో కుకునూర్ మండలంతో పాటు.. కాకినాడ జిల్లాలో గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాలు. పార్వతిపురంమాన్యం జిల్లాలో గరుగుబిల్లి, జియమ్మవలస, కొమరాడ, వీరఘట్టం మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఇక ఎల్లుండి (బుధవారం) మొత్తం 69 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వీటిలో అల్లూరి సీతారామరాజు జిల్లా 2, అనకాపల్లి 8, తూర్పు గోదావరి 6, ఏలూరు 3, గుంటూరు 3, కాకినాడ 4, కృష్ణా 1, నంద్యాల 1, ఎన్టీఆర్ 9, మన్యం 7, శ్రీకాకుళం 2, విశాఖ 1, విజయనగరం 13, వైయస్సార్ 9 మండలాలు ఉన్నట్లు ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..