Long Range Bomb: చైనాకు ఇక దబిడి దిబిడే.. మొన్న అగ్ని 5.. నేడు లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం..

భారత పరిశోధకులు డ్రాగన్ కంట్రీ చైనా గుండెళ్లో గుబులు పుట్టిస్తున్నారు. బాంబులు పేల్చుతున్నారు. తాజాగా డీఆర్‌డీఓ జరిపిన లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం అయ్యింది.

Long Range Bomb: చైనాకు ఇక దబిడి దిబిడే.. మొన్న అగ్ని 5.. నేడు లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం..
Long Range Bomb
Follow us

|

Updated on: Oct 29, 2021 | 5:59 PM

Long Range Bomb: భారత పరిశోధకులు డ్రాగన్ కంట్రీ చైనా గుండెళ్లో గుబులు పుట్టిస్తున్నారు. బాంబులు పేల్చుతున్నారు. వంకర బుద్ధికి చెక్ పెట్టే పనిలో పడ్డారు. మొన్నటి మొన్న అగ్ని 5 ప్రయోగించడంతో చైనా వణుకు తెప్పించారు. తాజాగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన లాంగ్-రేంజ్ బాంబును శుక్రవారం ఏరియల్ ప్లాట్‌ఫారమ్ నుండి విజయవంతంగా పరీక్షించారు. భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ నుండి సుదూర శ్రేణి వార్‌హెడ్‌ను ప్రయోగించిన తర్వాత నిర్దిష్ట పరిధులలో ఖచ్చితత్వంతో సుదూర శ్రేణిలో భూ-ఆధారిత లక్ష్యానికి నిర్దేశించబడిందని DRDO పేర్కొంది. అలాగే మిషన్ లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా పూర్తి చేశామన్నారు.

అంతకుముందు బుధవారం అగ్ని-5 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ విజయంతో  5,000 కి.మీ కంటే ఎక్కువ పరిధి గల అణు క్షిపణులను కలిగి ఉన్న అతికొద్ది శక్తులలో భారతదేశం ఒకటిగా మారింది. అగ్ని 5 పరీక్షలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ కూడా పాల్గొంటుంది. స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ క్రింద పని చేస్తుంది. న్యూక్లియర్ కమాండ్ అథారిటీ దేశంలో అణ్వాయుధాలకు సంబంధించిన విషయాలను చూస్తుంది. అణ్వాయుధాలకు సంబంధించిన వ్యూహాన్ని రూపొందిస్తుంది.

అణు దాడి జరిగితే.. ఏదైనా ఆమోదం అవసరమా? న్యూక్లియర్ కమాండ్ అథారిటీలో ప్రధానమంత్రి, హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ మంత్రులు చేరతారు. అగ్ని 5 క్షిపణులు అణు వార్‌హెడ్‌లను కూడా మోసుకెళ్లగలవు. కాబట్టి, స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ దాని పరీక్షలో చేర్చబడింది. స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ సమక్షంలో నిర్వహించిన పరీక్షలో భద్రతా బలగాల వినియోగానికి ఈ క్షిపణి సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. అంటే.. ఇప్పుడు చైనాలోని చాలా నగరాలను నేరుగా భారత్ టార్గెట్‌ చేయగలదు.

అగ్ని5 క్షిపణి.. అంటే యుద్ధంలో విజయాన్ని అందించడానికి భారతదేశ బ్రహ్మాస్త్రం. పరిధి 5 వేల కిలోమీటర్లు. ఇది శత్రువులకు కాలమైన భారతీయ బ్రహ్మాస్త్రం. ఇది శత్రువుల గుండెళ్లో విధ్వంసం సృష్టించగలదు. అగ్నిబోంబ్ పేరుతో ప్రపంచానికి కూడా తెలిసిన గొప్ప క్షిపణి ఇదే. ఇప్పుడు దాని కంటే అత్యంత శక్తివంతమైన విధ్వంసక వెర్షన్ లాంగ్ రేంజ్ బాంబ్ వచ్చింది. భారతదేశం మొదటిసారిగా చీకటిలో కూడా తన ఆయుదాలను విజయవంతంగా పరీక్షించింది. ఇంతకు ముందు భారత్ ఏడుసార్లు అగ్ని క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.

ఒకే క్షిపణితో అనేక లక్ష్యాలు

ఈ పరీక్షతో అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగల అగ్ని-5 క్షిపణిని ప్రవేశపెట్టడంతో అణ్వాయుధ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉన్న దేశాల జాబితాలో భారత్ చేరింది. భారత్ 8వ సారి అగ్ని క్షిపణిని ఓపెన్ టెస్ట్ చేసినట్టు సమాచారం.

ఇది MIRV అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్‌గా టార్గెట్ చేయదగిన రీ-ఎంట్రీ వెహికల్. అదేమిటంటే  అనేక ప్రాంతాలను ఒకేసారి నాశనం చేసే శక్తి ఉన్న బ్రహ్మాస్త్రం ఇది. ఈ అగ్ని ప్రయోగంతో ఇప్పటికే జిన్‌పింగ్‌కు నిద్ర లేకుండా చేశారు.

ఇవి కూడా చదవండి: Leander Paes – TMC: గోవా రాజకీయాల్లో మరో సంచలనం.. టీఎంసీలో చేరిన టెన్నిస్ స్టార్ ప్లేయర్

Facebook Smartwatch: ఆపిల్ వాచ్‌కు పోటీగా మెటా స్మార్ట్‌వాచ్‌.. ఇందులోని అద్భతమైన ఫీచర్స్ ఇవే..

Latest Articles