AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి చిక్కుల్లో డీకే శివకుమార్.. ఆయన నడిపిన స్కూటీపై 34 కేసులు, 18500 ట్రాఫిక్ జరిమానాలు

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హెబ్బాల్ ఫ్లైఓవర్ పై బైక్ నడిపి వివాదంలో చిక్కుకున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభానికి ముందు ప్రచారం కోసం బైక్ రైడ్ చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆయనపై ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ట్రాఫిక్ విభాగం చలానా జారీ చేసింది. తరువాత శివకుమార్ ఆ చలానాలను చెల్లించాడు.

మరోసారి చిక్కుల్లో డీకే శివకుమార్.. ఆయన నడిపిన స్కూటీపై 34 కేసులు, 18500 ట్రాఫిక్ జరిమానాలు
Dk Shivakumar Scooty Ride Hebbal Flyover
Surya Kala
|

Updated on: Aug 07, 2025 | 4:02 PM

Share

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కొత్త చిక్కుల్లో పడ్డారు. బెంగళూరులోని హెబ్బల్ ఫ్లైఓవర్ కొత్త లూప్ పై ఆయన బైక్ నడిపారు. ఫ్లైఓవర్ ప్రారంభానికి ముందు ఆయన ఈ బైక్ రైడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కొద్దిసేపటికే వివాదాస్పదమైంది. కర్ణాటక ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ఆయన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. విషయం తీవ్రమయ్యేసరికి ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ స్కూటర్ పై ఇప్పటికే 34 చలాన్లు ఉన్నట్లు తేలింది.

శివకుమార్ నడుపుతున్న స్కూటర్ నంబర్ KA 04 JZ 2087 అనేక ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిందని ప్రజలు చెప్పారు. ఆ స్కూటర్ పై ట్రాఫిక్ పోలీసులు 34 కి పైగా జరిమానాలు విధించారు. దీంతో రూ.18,500 వరకూ చెల్లించాల్సి ఉంది.

DK శివకుమార్ వీడియోను ప్రతి పార్టీ నేతలు పోస్ట్ చేసి హెబ్బాల్ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశారు. వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పబ్లిసిటీ రీల్స్‌పై దృష్టి పెట్టకుండా తన బాధ్యతలను నిర్వర్తించాలని వారు చెప్పారు. శివకుమార్ ధరించిన హెల్మెట్‌పై కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఆన్‌లైన్‌లో చర్చ జరిగింది. నాయకులు రోడ్డు భద్రతా నియమాలను తప్పని సరిగా పాటించాలని ప్రజలు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అసలు వివాదం ఏంటంటే?

నిజానికి ఆగస్టు 5న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హెబ్బాల్ ఫ్లైఓవర్ పై నిర్మించిన కొత్త లూప్ ను పరిశీలించడానికి వచ్చారు. ఈ సమయంలో ఆయన గేర్ లేని స్కూటర్ నడిపారు. ఆయన మొదట ఒంటరిగా స్కూటర్ నడిపారు. తర్వాత తన వెనుక ఒక వ్యక్తిని కూర్చోబెట్టుకుని నడిపారు. అయితే ఆ స్కూటర్ ఎవరిది అనేది స్పష్టంగా తెలియదు. కానీ ట్రాఫిక్ పోలీసులు వాహన యజమానికి సమన్లు పంపి జరిమానా చెల్లించాలని కోరిందని చెప్పారు.

స్కూటర్ యజమాని ఎవరు?

వాహన యజమాని హెబ్బాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వచ్చి రూ.1000 జరిమానా చెల్లించాడని పోలీసులు తెలిపారు. మిగిలిన రూ.17500 జరిమానాను కొన్ని రోజుల్లో చెల్లిస్తానని చెప్పారు. ఈ గేర్ లెస్ స్కూటర్ నంబర్ KA 04 JZ 2087 బాబుజన్ పేరు మీద రిజిస్టర్ చేయబడింది. బాబుజన్ తండ్రి పేరు నన్నే సాబ్ ఎస్. ఈ స్కూటర్ RT నగర్ లోని భువనేశ్వరినగర్ లోని ఒక చిరునామాలో రిజిస్టర్ చేయబడింది.

స్కూటర్ కోసం జారీ చేయబడిన 34 చలాన్లలో డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ లో మాట్లాడటం, ట్రాఫిక్ సిగ్నల్స్ ను బ్రేక్ చేయడం, తప్పు ప్రదేశంలో పార్కింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి.

అయితే DK శివకుమార్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లైసెన్స్ పత్రాలను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. అలాంటి హెల్మెట్లు ధరించే సామాన్యులకు పోలీసులు చలాన్ చేస్తే, శివకుమార్ కు ఎందుకు చలాన్ చేయకూడదని అంటున్నారు కొంత మంది ప్రజలు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..