AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తనని అడ్డగించిన పొదపై గున్న ఏనుగుకి కోపం.. దానిని శిక్షించే విధానం చూస్తే నవ్వకుండా ఉండలేరు.. ఫన్నీ వీడియో వైరల్

జంతువులకు సంబంధించిన ఎటువంటి వీడియో అయినా నెటిజన్లను ఆకర్షిస్తుంది. అందులో కుక్కపిల్లలు, ఏనుగు పిల్లలకు సంబంధించిన వీడియోల గురించి అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. మనిషి తరహ ప్రవర్తన కలిగి ఉండే ఏనుగులు అంటే మనుషులు ఎప్పుడూ ఇష్టమే.. ఇక గున్న ఏనుగు చేసే పనులు, సరదా పనులకు సంబంధించిన వీడియోలను ఇష్టపడే వారి గురించి అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక గున్న ఏనుగుకి చిలిపి శేష్టల వీడియో వైరల్ అవుతుంది. ఇది చూస్తే నవ్వు ఆపడం కష్టతరమే..

Viral Video: తనని అడ్డగించిన పొదపై గున్న ఏనుగుకి కోపం.. దానిని శిక్షించే విధానం చూస్తే నవ్వకుండా ఉండలేరు.. ఫన్నీ వీడియో వైరల్
Baby Elephant Video
Surya Kala
|

Updated on: Aug 07, 2025 | 1:30 PM

Share

సోషల్ మీడియాలో ఒక గున్న ఏనుగుకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో అడవి నుంచి బయటకు వస్తున్న పిల్ల ఏనుగును చూస్తే.. ఒక పార్కులో ఆడుకుంటున్న పిల్లాడిలా అనిపిస్తుంది. ఈ ఏనుగు తన సొంత ప్రపంచంలో మునిగిపోయింది. అడవి నుంచి గున్న ఏనుగు రోడ్డుమీదకి అడుగు పెట్టె సముయంలో దాని కాలికి పొద చుట్టుకుంది. అది ముందుకు అడుగు వెయ్యకుండా అడ్డుకుంది. ఆ పొద “బిడ్డా, ఈ రోజు నిన్ను ఇక్కడే ఆపేస్తాను” అని నిర్ణయించుకున్నట్లుగా ఉంది. పొదలోని కొంత భాగం తాడులా ఏర్పడి ఏనుగు కాలిని చిక్కుకుంది. దీంతో ఏనుగుకి చికాకు వచ్చినట్లు ఉంది. అది తన బలాన్ని ఉపయోగించింది. తన తొండం ఊపింది, తన పాదాలతో ఆ పోదని తొక్కింది. అయితే ఆ పొద ఎగిరి దాని చిన్న దంతాలలో ఇరుక్కుపోయింది. అప్పుడే అసలు నాటకం ప్రారంభమైంది.

గున్న ఏనుగును కలవరపెట్టిన పొద తనని అడ్డగించిన పొదపై ఆ పిల్ల ఏనుగుకి కోపం వచ్చేసింది. ఆ పొదను రోడ్డుపైకి లాక్కుని వచ్చి.. ఓ రేంజ్ లో విధ్వంసం సృష్టించింది. ఇది చూస్తే మీరు నవ్వి నవ్వి అలసిపోతారు. మొదట ఆ పొదను తన కాళ్ళ కింద వేసి తొక్కింది. తరువాత దానిని తన్ని, చివరికి తన తొండంతో దానికి గుణపాఠం నేర్పింది. ఈ సమయంలో గున్న ఏనుగు ఆ పొద చేసిన అల్లరి అంతా దుమ్ముగా మారిపోయింది. ఈ చిన్న ఏనుగు తాను పొదతో చేసిన యుద్ధంలో గెలిచి.. “ఇప్పుడు నన్ను ఎవరు ఆపుతారో చూద్దాం” అని చెబుతున్నట్లుగా ముందుకు కదిలింది.

ఇవి కూడా చదవండి

ఈ సరదా వీడియో చూసి నవ్వుతున్న నెటిజన్లు ఆ చిన్న ఏనుగు వీడియో చాలా ఫన్నీగా ఉంది. దీనిని చూసిన వెంటనే పగలబడి నవ్వుతారు. ఆ గున్న ఏనుగు చేసే అమాయకమైన అల్లరి , దాని కోపం అందరికీ ప్రేమని కలిగిస్తుంది. నవ్వులతో నింపుతుంది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని మళ్లీ మళ్లీ చూసిన తర్వాత బిగ్గరగా నవ్వుతున్నారు. ఈ వీడియోను aanakazhchakalum_viseshangalum అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. దీనిలో వేలాది మంది స్పందిస్తున్నారు. 50 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి వ్యాఖ్యానించారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..