Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. ఉగ్రకుట్రకు సహకరించిన మరో కీలక నిందితుడు అరెస్ట్!
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబ్ పేలుడు కోసం సాంకేతిక సహాయం చేసిన జసీర్ బిలాల్ వాని అలియాస్ డానిష్ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఇతను ఉమర్ నబీతో కలిసి ఉగ్ర కుట్రలకు పాల్పడినట్టి అధికారులు గుర్తించారు. దీంతో సోమవారం కశ్మీర్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడి దాడిలో ఉగ్రవాది డాక్టర్ ఉమర్‌కు సహకరించిన జసీర్ బిలాల్ వాని అలియాస్ డానిష్ అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఇతను ఉమర్ నబీతో కలిసి ఉగ్ర కుట్రలకు పాల్పడినట్టి అధికారులు గుర్తించారు. ఇతను పేలుడు కోసం సాంకేతిక పరికరాలను సహాయం చేయడంతో పాటు దాడి సమయంలో బాంబ్ పేలుడును డ్రోన్ల ద్వారా ఆపరేట్ చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ డానిష్ రాకెట్లను కూడా తయారు చేసేవాడని అధికారులు గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ఖాజిగుండ్‌కు చెందిన డానిష్ ఈ దాడిలో కీలకంగా వ్యవహరించాడని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రదాడికి ముందు డ్రోన్‌లను సవరించడం, రాకెట్‌లను నిర్మించడంలో జాసిర్ సాంకేతిక సహాయాన్ని అందించాడని NIA దర్యాప్తులో తేలింది.ఇతను ఉగ్రవాది ఉమర్ నబీతో కలిసి ఈ మారణహోమానికి ప్లాన్ చేసినట్టు తెలుసుకున్నారు. ఇక పక్కా సమాచారంతో అతన్ని జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం అరెస్ట్ చేశారు. ఇతన్ను అరెస్ట్ చేసినట్టు ఎన్‌ఐఏ అధికారులు ప్రకటించారు.
ఇక ఈ ఉగ్రదాడి వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి NIA అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని గుర్తించడానికి దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానంగా ఉంటున్న వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




