Kuldeep Yadav : కుల్దీప్ చాలా డేంజర్..ఆ కొత్త ఐసీసీ నియమం వల్లే చైనామన్ ఇంత ప్రమాదకరంగా మారాడా ?
Kuldeep Yadav : దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకోవడంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషించారు. సిరీస్‌లో అత్యధికంగా 302 పరుగులు చేసిన ఆయన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు. అయితే ఈ విజయంలో కోహ్లీతో పాటు లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కృషిని కూడా మర్చిపోలేం.

Kuldeep Yadav : దక్షిణాఫ్రికాపై 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను భారత్ గెలుచుకోవడంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషించారు. సిరీస్‌లో అత్యధికంగా 302 పరుగులు చేసిన ఆయన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు. అయితే ఈ విజయంలో కోహ్లీతో పాటు లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కృషిని కూడా మర్చిపోలేం. సిరీస్‌లో ఇరు జట్లలో కలిపి అత్యధికంగా 9 వికెట్లు పడగొట్టింది కుల్దీప్ యాదవే. టీమిండియా గెలిచిన రెండు మ్యాచ్‌లలోనూ కుల్దీప్ స్పెల్ గేమ్ రూపురేఖలను మార్చింది. ఈ అనూహ్య విజయం వెనుక ఐసీసీ తీసుకొచ్చిన ఒక కొత్త నియమం కుల్దీప్‌కు పెద్ద అండగా నిలిచింది.
కుల్దీప్ యాదవ్ తన రిస్ట్ స్పిన్ కారణంగా మూడు ఫార్మాట్‌లలో ఇప్పటికే విజయవంతమైన బౌలర్ అయినప్పటికీ ఈ సిరీస్‌లో ముఖ్యంగా చివరి వన్డే మ్యాచ్‌లో ఆయన విజయం వెనుక ఐసీసీ చేసిన ఒక పెద్ద నిబంధన మార్పు ప్రభావం ఉంది. గత 10 ఏళ్లుగా వన్డే క్రికెట్‌లో ఇన్నింగ్స్ ఆరంభం నుంచి రెండు వైపుల నుంచి కొత్త బంతులను వినియోగించేవారు. ఇది బ్యాట్స్‌మెన్‌లకు పరుగులు సులభతరం చేసింది. దీనివల్ల బంతి పాతబడకుండా మృదువుగా మారకుండా ఉండేది.
బ్యాట్, బంతి మధ్య బ్యాలెన్స్ దెబ్బతినడంతో, ఈ ఏడాది ఐసీసీ నిబంధనను మార్చింది. ఇప్పుడు వన్డే మ్యాచ్‌లోని ఒక ఇన్నింగ్స్‌లో రెండు వైపుల నుంచి కొత్త బంతిని ఉపయోగించినప్పటికీ, అది కేవలం 34వ ఓవర్ వరకు మాత్రమే అమలు అవుతుంది. 34వ ఓవర్ తర్వాత ఫీల్డింగ్ జట్టు రెండు బంతుల్లోంచి ఒక బంతిని ఎంచుకోవాలి. మిగిలిన 16 ఓవర్లు ఆ ఒకే బంతితో బౌలింగ్ చేయాలి. ఒకే బంతిని వాడటం వల్ల అది పాతబడి, మృదువుగా మారుతుంది. దీనివల్ల బ్యాట్స్‌మెన్‌లకు భారీ షాట్లు ఆడటం కష్టమవుతుంది. ఇది స్పిన్నర్లకు, ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ వంటి రిస్ట్ స్పిన్నర్‌లకు చాలా ప్రయోజనకరంగా మారింది.
కుల్దీప్ యాదవ్ వంటి రిస్ట్ స్పిన్నర్‌లకు, బంతిని గ్రిప్ చేయడం, సరైన లైన్-లెంగ్త్‌తో బౌలింగ్ చేయడం ఎప్పుడూ కొంచెం కష్టమే. అయితే బంతి పాతబడి, మృదువుగా మారినప్పుడు ఈ సమస్య కొంత తగ్గుతుంది. విశాఖపట్నంలో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో ఈ కొత్త నిబంధన ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచ్‌లో కుల్దీప్ కేవలం 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు.
ముఖ్యంగా 39వ ఓవర్‌లో కుల్దీప్ మ్యాజిక్ చూపించారు. కేవలం 3 బంతుల్లోనే డేవాళ్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్ వికెట్లను తీశారు. ఆ తర్వాత 43వ, 45వ ఓవర్లలో ఒక్కో వికెట్ తీసి మొత్తం 4 వికెట్లతో సఫారీల స్కోరును 270 పరుగులకే పరిమితం చేశారు. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం కుల్దీప్ యాదవ్ వంటి స్పిన్నర్ల బలాన్ని మరింత పెంచింది. సాధారణ పరిస్థితుల్లో కూడా ఆయన అద్భుతమైన బౌలరే అయినప్పటికీ, ఈ కొత్త నియమం ఇన్నింగ్స్ చివరి 10 ఓవర్లలో కూడా నిలకడగా బౌలింగ్ చేసి, బ్యాట్స్‌మెన్‌లకు పెద్ద ప్రమాదంగా మారడానికి వీలు కల్పించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




