రోజూ నీళ్లు తక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా..? తస్మాత్ జాగ్రత్త..!
శరీరానికి సరైన మోతాదులో నీళ్లు తాగడం చాలా ముఖ్యం. నీరు తక్కువైతే డీహైడ్రేషన్‌కు గురై అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం, తలనొప్పి, అలసట, చర్మ సమస్యలు, నోటి దుర్వాసన, కండరాల తిమ్మిర్లు వంటివి వీటిలో కొన్ని. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తగినన్ని నీళ్లు తాగాలి.

కొంతమంది నీళ్లను పుష్కలంగా తాగితే.. మరికొంతమంది మాత్రం నీళ్లను మరీ తక్కువగా తాగుతుంటారు. కానీ, మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరైన మోతాదులో నీళ్లు తాగడం చాలా ముఖ్యం. లేకపోతే బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అంతేకాదు..శరీరంలోని అన్ని భాగాలు సక్రమంగా పనిచేయాలంటే కూడా సరైన మోతాదులో నీళ్లు తాగడం చాలా ముఖ్యం. కానీ కొంతమంది నీళ్లను అవసరానికి సరిపడా తాగరు. ఇలా తాగకుంటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నీళ్లు తక్కువగా తాగే వారిలో చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా నీళ్లు సరిపడా తాగకపోవడం వల్ల పేగుల్లో మలం గట్టిగా మారుతుంది. దీంతో మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే రోజూ సరిపడా నీళ్లు తాగడం చాలా అవసరం. నీళ్లు తక్కువగా తాగితే మెదడుకు రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో తలనొప్పిగా అనిపిస్తుంది. తరచూ తలనొప్పి వస్తే నీళ్లు తక్కువగా తాగుతున్నారని అర్థం. నీళ్లు సరిపడా తాగకపోతే శరీరానికి తగినంత రక్త ప్రసరణ జరగదు. దీంతో పోషకాలు అందవు. తద్వారా నీరసంగా అనిపిస్తుంది. తొందరగా అలసిపోతారు.
నీళ్లు తక్కువగా తాగితే చర్మం డీహైడ్రేట్ అవుతుంది. దీంతో స్కిన్ డ్రైగా మారిపోతుంది. తద్వారా చర్మంపై ముడతలు కూడా తొందరగా వస్తాయి. అందుకే చర్మం ఎల్లపుడూ యవ్వనంగా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. నీళ్లు తక్కువగా తాగితే మూత్రం ముందురు రంగులోకి మారుతుంది. దీంతో మూత్రం పసుపు రంగులో వస్తుంది. నీళ్లు తక్కువగా తాగుతున్నారని తెలుసుకునేందుకు మూత్రం రంగు గమనించొచ్చు.
నీళ్లు తక్కువగా తాగితే నోరు పొడిబారిపోతుంది. దీంతో చెడు బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. తద్వారా నోరు దుర్వాసన వస్తుంది. నోటి దుర్వాసన రావడానికి నీళ్లు తక్కువగా తాగడం కూడా ఓ కారణం అని గుర్తించాలి. శరీరంలో నీళ్లు తక్కువగా ఉంటే కండరాలకు రక్త ప్రసరణ తగ్గిపోయి లవణాలు సరిగా అందవు. దీంతో కండరాలు బిగుతుగా మారి పట్టేస్తాయి. అలాగే కండరాల తిమ్మిర్లు కూడా ఎక్కువగా ఉంటాయి.
నీళ్లు తక్కువగా తాగితే రక్తపోటు తగ్గిపోతుంది. దీంతో తల తిరిగినట్లుగా అనిపిస్తుంది. నీళ్లు తక్కువగా తాగడం వల్ల లోబీపీ వస్తుంది. అందుకే సరిపడా నీళ్లు తాగాలి. నీళ్లు తగినంత తాగకపోవడం వల్ల గందరగోళంగా అనిపిస్తుంది. కోపం, బాధ, చికాకు ఇలా చాలా మూడ్ స్వింగ్స్ కనిపిస్తాయి. అందుకే మానసిక ప్రశాంతత కోసం వాటర్ సరిపడా తాగడం అవసరం.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








