జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే…
జామపండులో డైటరీ ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, షుగర్ నియంత్రణకు తోడ్పడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యం, క్యాన్సర్ నివారణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

జామపండ్లలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా తొక్కతో తింటే మరీ మంచిది. ఇది పేగు కదలికలను మెరుగుపర్చి మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. జామపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీర కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్ల బారినపడకుండా చూసుకోవచ్చు. జామపండ్లలోని ఫైబర్ రక్తంలో షుగర్ ఒక్కసారిగా పెరగకుండా కాపాడుతుంది. షుగర్ నెమ్మదిగా రిలీజ్ కావడం వల్ల ఎనర్జీ కూడా ఎక్కువసేపు ఉంటుంది. డయాబెటిస్ రాకుండా కాపాడుకోవచ్చు.
జామపండ్లలోని పొటాషియం, ఫైబర్ వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ ఎక్కువగా ఉన్నవారు ఈ జామ పండ్లు తింటే సమస్య తొందరగా తగ్గుతుంది. జామపండ్లలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. తద్వారా తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఆకలి అదుపులో ఉంచి బరువు తగ్గేలా చేస్తుంది.
జామపండ్లలోని ఫ్లేవనాయిడ్స్, ఫిలోలిక్ యాసిడ్స్, టానిన్స్ ఉంటాయి. వీటిలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కీళ్లలో మంట, వాపు వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. తద్వారా ఆర్థరైటిస్ రాకుండా కాపాడుకోవచ్చు. జామపండ్లలోని పోషకాలు కంటికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. తద్వారా వయసు పెరిగినా కంటి సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
జామపండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకు ఒక జామ పండు తింటే ఎల్లపుడూ యవ్వనంగా కనిపించొచ్చు. జామపండ్లలో పాలిఫినాల్స్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ముఖ్యంగా పేగు క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








