Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో 20 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే
అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్త చెప్పింది. ఏపీలోని విశాఖ పట్నం నుంచి కేరళలోని కొల్లంకు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం- కొల్లాం మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. కాబట్టి ఈ రైళ్లు ఏయే తేదీల్లో అందుబాటులో ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.

ఏపీ నుంచి శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్త చెప్పింది. పీలోని విశాఖ పట్నం నుంచి కేరళలోని కొల్లంకు మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు పేర్కొంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం- కొల్లాం మధ్య 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు వెల్లడించింది. ఈ 20 ప్రత్యేక రైళ్లు రెండు వైపుల నుంచి ప్రయాణికులకు అందుబాలో ఉండనున్నాయి. ఇందులో విశాఖ నుంచి కొల్లాంకు 10 ప్రత్యేక రైళ్లు నడపనుండగా, కొల్లాం నుంచి విశాఖకు మరో 10 రైళ్లను నడపనున్నారు.
ఈ సేవలు ఈ నెల 18 నుంచి జనవరి 20 వరకూ అందుబాటులో ఉండనున్నాయని రైల్వేశాఖ పేర్కొంది. విశాఖ నుంచి కొల్లంకు వెళ్లే 08539 నెంబర్ గల రైళు ప్రతీ మంగళవారం విశాఖలో ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రతి బుధవారం కొల్లం నుంచి విశాఖకు ఓ ప్రత్యేక రైలు చొప్పున 10 రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట కాట్పడి, జోలార్ పెట్టాయ్, పాలక్కాడ్, అలువా, ఎర్నాకుళం, కొట్టాయం, తిరువళ్ల, చెంగన్నూర్, కాయంకుళం మీదుగా నడుస్తాయి. అలాగే ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా ఉందని.. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




