Twin Towe: ట్విన్ టవర్స్ పేలుడు వల్ల భూకంపం వస్తుందా..? చివరి 60 సెకన్లే ముఖ్యం.. కేవలం 12 సెకన్లలోనే భవనాలు స్మాష్‌..!

Twin Towe: నోయిడాలోని సూపర్‌టెక్ అక్రమ ట్విన్ టవర్లను ఆదివారం (ఈరోజు) మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేయనున్నారు. ఈ భవనాలు దాదాపు 100 మీటర్ల ఎత్తులో..

Twin Towe: ట్విన్ టవర్స్ పేలుడు వల్ల భూకంపం వస్తుందా..? చివరి 60 సెకన్లే ముఖ్యం.. కేవలం 12 సెకన్లలోనే భవనాలు స్మాష్‌..!
Twin Tower
Follow us
Subhash Goud

|

Updated on: Aug 28, 2022 | 11:30 AM

Twin Towe: నోయిడాలోని సూపర్‌టెక్ అక్రమ ట్విన్ టవర్లను ఆదివారం (ఈరోజు) మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేయనున్నారు. ఈ భవనాలు దాదాపు 100 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఇది కుతుబ్ మినార్ ఎత్తు కంటే ఎక్కువ. వాటర్ ఫాల్ ఇంప్లోషన్ టెక్నిక్‌తో సురక్షితంగా కూల్చివేస్తామని భవనాన్ని కూల్చివేసే పనిలో ఉన్న ఎడ్ఫిస్ ఇంజినీరింగ్ అధికారి తెలిపారు. పేలుడుకు ముందు 60 సెకన్లు చాలా ముఖ్యమైనవి. అపెక్స్ టవర్ (32 అంతస్తులు), సియాన్ (29 అంతస్తులు) 12 సెకన్లలోపు కుప్పకూలనున్నాయి. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నారు అధికారులు. చుట్టుపక్కల భవనాల్లోని పెయింట్‌, ప్లాస్టర్‌కు చిన్నపాటి పగుళ్లు తప్ప ఎలాంటి నష్టం వాటిల్లదని చెబుతున్నారు. అయితే ఈ రెండు టవర్లు పడిపోవడానికి 12 సెకన్లు మాత్రమే పడుతుంది. పేలుడుకు ముందు చివరి 60 సెకన్లు ఎంతో ముఖ్యమని అధికారులు తెలిపారు.

కూల్చివేత ఎలా ప్రారంభం అవుతుంది..?

మధ్యాహ్నం 2.30 గంటలకు ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత నిపుణుడు చేతన్ దత్తా బ్లాక్ బాక్స్‌కు జోడించిన హ్యాండిల్‌ను 10 సార్లు రోల్ చేస్తారు. తర్వాత ఎరుపు బల్బ్ బ్లింక్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే టవర్స్‌ కూల్చేందుకు సిద్ధంగా ఉంది అని. తర్వాత చేతన్ దత్తా ఎరుపు తర్వాత ఆకుపచ్చ బటన్‌ను నొక్కుతారు. దీని కారణంగా విద్యుత్ తరంగం మొత్తం నాలుగు డిటోనేటర్లకు వెళుతుంది. అంతే.. కేవలం 9 నుండి 12 సెకన్లలో భవనంలో ఒకదాని తర్వాత ఒకటి పేలుళ్లు ప్రారంభమవుతాయి. అదే సమయంలో పేలుడు సంభవించిన వెంటనే ఈ భవనం శిథిలాలుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

2021 ఆగస్టులో ట్విన్ టవర్లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈరోజు జంట టవర్ల కూల్చివేత దృష్ట్యా, సమీపంలోని రెండు సొసైటీలు, ఎమరాల్డ్ కోర్ట్, ATS విలేజ్‌లోని దాదాపు 5,000 మంది నివాసితులు ఉదయం 7 గంటలకు తమ ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. దాదాపు 2700 వాహనాలు, పెంపుడు జంతువులను తమ వెంట తీసుకెళ్లాలని నివాసితులకు సూచించారు.

500 మీటర్ల పరిధిలో ఎవరినీ అనుమతించరు

ట్విన్ టవర్స్ నుండి 500 మీటర్ల లోపు ఎలాంటి వ్యక్తులను, వాహనాలకు అనుమతి ఉండదు. రెండు టవర్లను కూల్చేందుకు 3700 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించనున్నారు. ట్విన్ టవర్ కూల్చివేతతో 55 నుంచి 80 వేల టన్నుల శిథిలాలు విడుదలవుతాయని, దీన్ని తొలగించేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

పేలుడు వల్ల ఎంత వైబ్రేషన్ వస్తుంది?

ఎడ్ఫిస్ ఇంజనీర్ మయూర్ మెహతా ప్రకారం.. నోయిడాలో ఇప్పటివరకు సంభవించిన భూకంపం అంచనా వేయబడింది. సాధారణంగా ఇక్కడ భూకంపం 4 నుంచి 5 స్కేలులో ఉంటుంది. ఇది సెకనుకు 300 నుండి 400 మిమీల కంపనాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఎన్నో భూకంపాలు వచ్చినా భవనాలు దెబ్బతినకుండా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో జంట టవర్ కూలిపోయినప్పుడు నోయిడాలో భూకంపాలు 12 నుండి 16 రెట్లు తక్కువ వైబ్రేషన్ కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు భయపడాల్సిన పనిలేదని అధికారులు భరోసా ఇస్తున్నారు.

ఇళ్లలో చిన్నపాటి పగుళ్లు రావచ్చు

భవనం కూల్చివేతలో పాల్గొన్న ఎడ్ఫిస్ ఇంజినీరింగ్ భాగస్వామి ఉత్కర్ష్ మెహతా మాట్లాడుతూ.. జంట టవర్లను సురక్షితంగా, వారు అనుకున్న దిశలో లాగడం అనేది తప్పకుండా జరుగుతుందని చెప్పారు. పక్కనే ఉన్న భవనాల్లో నివాసముంటున్న వారికి రంగులు, ప్లాస్టర్‌లకు చిన్నపాటి పగుళ్లు ఏర్పడటం తప్ప ఎలాంటి ప్రమాదం ఉండదని, వారి ఇళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో టీవీలోని ప్లగ్‌ని తొలగించి, గాజు వస్తువులను లోపల ఉంచాలని వారు ప్రజలను కోరారు. గాలి పీడనం వల్ల గాజు వస్తువులు విరిగిపోతాయి. పేలుడు నుండి దుమ్ము ఉంటుంది. కానీ ఎంత అనేది అంచనా వేయలేము. భద్రతా కారణాల దృష్ట్యా, ఎమరాల్డ్ కోర్ట్, పరిసర సొసైటీల ఫ్లాట్లు ఖాళీ చేయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి