Twin Tower: ఈ ట్విన్‌ టవర్స్‌ కథేంటి.. ఎందుకు కట్టారు..? ఎందుకు కూల్చుతున్నారు..? కూల్చివేత ఖర్చు రూ.20 కోట్లు

Twin Tower: అటెన్షన్‌. నోయిడా మొత్తం అటెన్షన్‌. అధికారులు సీన్లలోకి వచ్చారు. ఉదయం నుంచి రంగంలోకి దిగారు. ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడుగంటల్లో నోయిడాలోని ట్వీన్‌ టవర్స్‌..

Twin Tower: ఈ ట్విన్‌ టవర్స్‌ కథేంటి.. ఎందుకు కట్టారు..? ఎందుకు కూల్చుతున్నారు..? కూల్చివేత ఖర్చు రూ.20 కోట్లు
Noida Twin Tower
Follow us

|

Updated on: Aug 28, 2022 | 11:29 AM

Twin Tower: అటెన్షన్‌. నోయిడా మొత్తం అటెన్షన్‌. అధికారులు సీన్లలోకి వచ్చారు. ఉదయం నుంచి రంగంలోకి దిగారు. ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడుగంటల్లో నోయిడాలోని ట్వీన్‌ టవర్స్‌ కూల్చివేస్తారు. ట్విన్‌ టవర్స్‌ డిమాలిషన్‌ ప్రాసెస్‌ కేవలం తొమ్మిది అంటే తొమ్మిది సెకన్లలో పూర్తి చేయనున్నారు. టవర్లను కూల్చివేసేందుకు 3,700 కేజీల పేలుడు పదార్థాలను అమర్చారు. వాటికి రెండు వేల వరకు కనెక్షన్లు ఇచ్చారు. కూల్చివేత వల్ల సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ భవనాల్లో ఉంటున్న వాళ్లను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. చుట్టుపక్కల బిల్డింగ్స్‌ను ప్లాస్టిక్ షీట్లతో కప్పేస్తున్నారు. ఆ ప్రాంతంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.

ఇంతకీ ఈట్వీన్‌ టవర్స్‌ ఎలా కూల్చివేస్తారు? అధికారులు ఎలా ప్లాన్‌ చేశారు?

1. తొమ్మిది సెకండ్ల రెండు బ్లాస్ట్‌లు చేస్తారు. ప్రైమరీ, సెకండరీగా ఈ పేలుళ్లు జరుపుతారు. 2. ప్రైమరీలో గ్రౌండ్‌ ప్లోర్‌తో పాటు 1, 2,6,10,14,22,26, 30 ప్లోర్‌ బ్లాస్ట్‌ చేస్తారు. 3. మిగతా ప్లోర్స్‌లో సెకండరీ బ్లాస్ట్‌లో పేలుస్తారు 4. కేవలం ఏడు సెకన్లలో ప్రైమరీ బ్లాస్ట్‌ జరుగుతోంది. 5. ఆ తర్వాత రెండు సెకన్లలో సెకండరీ బ్లాస్ట్‌ సీక్వెన్‌ నడుస్తోంది. 6. ప్రైమరీ.. సెకండరీ బ్లాస్ట్‌ ప్రకియ మొత్తం కేవలం 9 సెకండ్లలో పూర్తి అవుతుంది. మొత్తం ట్విన్‌ టవర్స్‌ నేలమట్టం అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇంతకీ ప్లాన్‌ ప్రకారం జరగుతుందా? అధికారులు ఏర్పాట్లు ఎలా చేశారు?

70 కోట్ల బడ్జెట్‌తో కట్టిన ఈ ట్విన్ టవర్లను నేలమట్టం చేయడానికి 20 కోట్లు ఖర్చవుతోంది. అంటే ప్రతీ చదరపు అడుగు కూల్చివేతకు 237 రూపాయలన్నమాట. కూల్చివేత తర్వాత ఏర్పడే శిథిలాల్ని తొలగించడం కోసం అదనంగా పదమూడున్నర కోట్ల కాంట్రాక్ట్ కుదిరింది. ఈ టవర్ల డెమాలిషన్ మొత్తం బాధ్యతల్ని ఎడిఫైస్ ఇంజనీరింగ్, వైబ్రోటెక్ సంస్థలకిచ్చింది నొయిడా అధికార యంత్రాంగం. గతంలో తెలంగాణా పాత సెక్రటేరియట్‌ కూల్చివేతను కూడా ఈ కంపెనీలే డీల్ చేశాయి.

అసలు ఈ భవనాలను ఎందుకు కూల్చుతున్నారు.. వీటి కథేంటి..

ఈ భారీ ట్విన్‌ టవర్స్‌ కూల్చడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఎమరాల్డ్‌ కోర్టు సమీపంలో సెక్టార్‌ 93ఏలో ఎపెక్స్‌, సియాన్‌ ట్విన్‌ టవర్స్‌ ఉన్నాయి. ఎపెక్స్‌ ఎత్తు 102 మీటర్లు. దీనిని 32 అంతస్తులతో నిర్మాణం చేపట్టారు. ఇక సియాన్‌ టవర్స్‌ 95 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఈ జంట భవనాల్లో 915 ప్లాట్స్‌, 21 వాణిజ్య సముదాయాలు, 2 బేస్‌మెంట్లు ఉన్నాయి. 13 సంవత్సరాల క్రితం అంటే 2009లో సూపర్‌టెక్‌ లిమిలెడ్‌ కంపెనీ ఈ టవర్స్‌ను నిర్మించింది. ఈ భవనాలను పూర్తి కావడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. అయితే నిబంధనలు పాటించకుండా ఈ భవనాలను నిర్మించింది సదరు కంపెనీ. అక్కడే వచ్చింది చిక్కు. నిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మించడంతో సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (NBC) వివరాల ప్రకారం.. గృహ నివాస భవనాల మధ్య కనీసం 16 మీటర్ల దూరం ఉండాలి. కానీ ఎపెక్స్‌కు, పక్కనే ఉన్న ఎమరాల్డ్‌ కోర్టులోని టవర్‌కు మధ్య దూరం కేవలం 9 మీటర్లు మాత్రమే ఉంది. దీంతో ఎమరాల్డ్‌ కోర్టు నివాసులు 2012లో కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా వీటి నిర్మాణం జరిగిందని అలహాబాద్‌ హైకోర్టు 2014లో తీర్పు ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టులోనూ భవనాలను నిర్మించిన సూపర్‌టెక్‌ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. ట్విన్‌ టవర్స్‌ కూల్చివేయాల్సిందేనని ఆగస్టు 31, 2021న కోర్టు తీర్పునిచ్చింది. ఈ రెండు టవర్స్‌ కూడా కుతుబ్‌ మినార్‌, ఇండియా గేట్‌ కంటే చాలా ఎత్తులో ఉన్నాయి.

రెండు టవర్లు ఎంత వివరాలు:

☛ అపెక్స్ టవర్ 102 మీటర్లు

☛ సీన్ టవర్ 95 మీటర్లు

☛ కుతుబ్ మినార్ 73 మీటర్లు

☛ ఇండియా గేట్ 42 మీటర్లు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు