AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manish Tewari: సొంత పార్టీ నేతల తీరును తప్పుబట్టిన మనీష్‌ తివారి.. అటెండర్లతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు

Manish Tewari: కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్షల వర్షం కురిపించుకుంటున్నారు. గులాంనబీ ఆజాద్‌ రాజీనామా..

Manish Tewari: సొంత పార్టీ నేతల తీరును తప్పుబట్టిన మనీష్‌ తివారి.. అటెండర్లతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు
Congress Mp Manish Tewari
Subhash Goud
|

Updated on: Aug 28, 2022 | 7:40 AM

Share

Manish Tewari: కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయాలు మరింతగా వేడెక్కుతున్నాయి. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్షల వర్షం కురిపించుకుంటున్నారు. గులాంనబీ ఆజాద్‌ రాజీనామా చేయడంతో సొంతింట్లో ముసలం నెలకొంది. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన గులాం నబీ ఆజాద్‌కు మద్దతు పెరుగుతోంది. ఆజాద్‌పై విమర్శలు చేసిన పార్టీ నేతలను అటెండర్లతో పోల్చారు కాంగ్రెస్‌ ఎంపీ మనీష్‌ తివారి. ఆజాద్‌తో మరో ఎంపీ ఆనంద్‌శర్మ భేటీ అయ్యారు. జమ్ముకశ్మీర్‌కు ఆజాద్‌ సీఎం అవుతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్ రాజకీయ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన కొత్త జాతీయ రాజకీయ పార్టీని ప్రకటిస్తారా ? లేక జమ్ముకశ్మీర్‌లో ప్రాంతీయ పార్టీని ప్రారంభిస్తారా ? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొనగా, తన సొంత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో తాను కొత్త పార్టీ పెడతానని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీరుకు కాబోయే ముఖ్యమంత్రి గులాంనబీ అని ఆయన అనుచరులు చెబుతున్నారు. జమ్మూకశ్మీరులో గులాంనబీ ఆజాద్ త్వరలో సొంత పార్టీ పెడతారని వాళ్లంటున్నారు. ఆజాద్‌కు మద్దతుగా ఇప్పటివరకు ఐదుగురు కశ్మీర్‌ కాంగ్రెస్‌ నేతలు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ 5 పేజీల లేఖ రాశారు.

అయితే పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆజాద్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ మనీస్‌ తివారి సొంత పార్టీ నేతల తీరును తప్పుపట్టారు. అటెండర్‌ స్థాయి వ్యక్తులు ఆజాద్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆజాద్‌ను మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌శర్మ కలిశారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌కు వ్యతిరేకంగా జీ-23 గ్రూపులో మనీష్‌ తివారితో పాటు ఆనంద్‌శర్మ కీలకంగా వ్యవహరించారు.

ఆజాద్‌కు మద్దతుగా మనీష్‌ తివారి వ్యాఖ్యలు చేయడం.. ఆనంద్‌శర్మ ఆయనతో భేటీ కావడం కాంగ్రెస్‌లో కల్లోలం ఇప్పట్లో ఆగదని స్పష్టం చేస్తోంది. చాలామంది జీ-23 నేతలు రాహుల్‌గాంధీ తీరుపై విరుచుకుపడుతున్నారు. రాహుల్‌ వల్లే కాంగ్రెస్‌ సర్వనాశనమయ్యిందని విమర్శిస్తున్నారు. అయితే గాంధీ కుటుంబం విధేయులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. పదవులు అనుభవించిన నేతలు కాంగ్రెస్‌కు అధికారం లేకపోవడంతో ఇలా విమర్శలు చేసి వెళ్లిపోతున్నారని మండిపడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అత్యవసరంగా భేటీ అవుతోంది. ఆజాద్‌ రాజీనామా వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి