AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్ బీజేపీలో చేరనున్నారా..? కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? ఇదిగో క్లారిటీ

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ముందే కష్టాల్లో ఉన్న పార్టీకి మరిన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయి. తాజాగా గులాం నబీ ఆజాద్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం..

Ghulam Nabi Azad: గులాం నబీ ఆజాద్ బీజేపీలో చేరనున్నారా..? కొత్త పార్టీ పెట్టబోతున్నారా..? ఇదిగో క్లారిటీ
Ghulam Nabi Azad
Subhash Goud
|

Updated on: Aug 27, 2022 | 9:43 AM

Share

Ghulam Nabi Azad: కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ముందే కష్టాల్లో ఉన్న పార్టీకి మరిన్ని కష్టాలు వచ్చి పడుతున్నాయి. తాజాగా గులాం నబీ ఆజాద్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిపిందే. పార్టీ పదవులకు తాను రాజీనామా చేస్తున్నట్లు సోనియాగాంధీకి లేఖ రాశారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో లుకలుకలు మరింత మొదలయ్యాయి. పార్టీ అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్‌ పార్టీ తలమునకలవుతుంటే ఈ రాజీనామాతో మరింత వేడెక్కింది. ఇక తాజాగా గులాం నబీ ఆజాద్‌ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీలో చేరబోతున్నారని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తన సొంత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్ లో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని, జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించి పార్టీ గురించి చర్చిందుకు పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆజాద్, నేను జాతీయ పార్టీని స్థాపించడానికి తొందరపడటం లేదు.. కానీ జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికల అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, త్వరలో అక్కడ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను అని ఆజాద్ అన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, తన కొత్త పార్టీ ఏర్పాటుపై మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.

జాతీయ రాజకీయాల సంగతి తర్వాత ఆలోచిస్తానని గులామ్‌నబీ చెప్పారు. ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు స్థానిక నాయకులతో వ్యక్తిగతంగా కలిసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు స్థానికులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి.. జమ్ము కశ్మీర్ వేదికగా విజయం సాధించాలని యోచనలో ఉన్నట్టు సమాచారం.

తన రాజీనామాపై ఎలాంటి విషయాలను చెప్పేందుకు నిరాకరించిన ఆజాద్.. నేను ఈ నిర్ణయాన్ని చాలా ఆలోచించాను.. దానిని ఉపసంహరించుకునే ప్రశ్న లేదు అని ఆజాద్ అన్నారు. త్వరలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతా. త్వరలో జమ్మూ కాశ్మీర్‌లో పార్టీని ఏర్పాటు చేస్తాను. నేను భారతీయ జనతా పార్టీలో చేరను అంటూ క్లారిటీ ఇచ్చారు ఆజాద్‌.

ఇవి కూడా చదవండి

దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత..

గులాం నబీ ఆజాద్‌ శుక్రవారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి, దేశంలోనే ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న పార్టీ పూర్తిగా నాశనమైందని, అంతర్గత ఎన్నికల పేరుతో ఆ పార్టీ నాయకత్వం ‘మోసం’ చేస్తోందని పేర్కొనడం గమనార్హం. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అపరిపక్వ, చిన్నపిల్లల ప్రవర్తన అని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ సెక్యూరిటీ గార్డులు, వ్యక్తిగత సహాయకులు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు సోనియా గాంధీ నామమాత్రపు నాయకురాలిగా మారారని అన్నారు.

కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు తిరిగి రాలేని స్థితికి చేరుకుందని ఆజాద్ అన్నారు. పార్టీలో నాయకత్వం కోసం తన ప్రజాప్రతినిధులను పరోక్షంగా నెట్టివేస్తున్నారని అన్నారు. ఏఐసీసీని నడుపుతున్న కొందరు వ్యక్తులు తయారు చేసిన జాబితాలపై ఏఐసీసీకి ఎన్నికైన ఆఫీస్ బేరర్లు బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని, పార్టీతో జరిగిన భారీ మోసానికి నాయకత్వమే కారణమని ఆరోపించారు.

గులాం నబీ ఆజాద్ రాజీనామాపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. తిరిగి ట్రాక్‌లో ఉన్నప్పుడు పార్టీని వీడినా ఫర్వాలేదు.. కానీ వదిలేయడం మంచిది కాదు. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదన్నారు.

మరిన్ని జాతీయ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి