Viral Video: ఇదో విచిత్ర ప్రేమ కథాచిత్రం.. ఒకే యువకుడిని ప్రేమించిన ఇద్దరమ్మాయిలు.. అతగాడి కోసం ఏం చేశారంటే..!
ఒక అమ్మాయి సదరు ప్రియుడితో కలిసి స్థానిక బస్టాండ్‌కు చేరుకుంది. ఆ సమయంలో మరో అమ్మాయి కూడా అక్కడే ఉంది. వీళ్లిద్దరినీ గమనించి.. దగ్గరకు వచ్చి నిలదీసింది. దాంతో..

Viral Video: ఇద్దరు యువతులు..ఒకే యువకుడిని ప్రేమించారు. ఒకరికీ తెలియకుండా మరోకరితో అతగాడు బాగానే ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. కానీ, ఆ నిజం ఎంతోకాలం దాగలేదు..అసలు విషయం ఆ ఇద్దరు యువతులకు తెలిసి పోయింది. విషయం బయటపడేసరికి.. సదరు ప్రేమికుడి దుమ్ముదులిపేస్తారనుకున్న ఆ ఇద్దరమ్మాయిలు.. వాళ్లలో వాళ్లే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని బాహాబాహీకి దిగారు. చుట్టూ జనం చూస్తుండగా ఓ బస్టాండ్ ఆవరణలోనే ఇద్దరు కుమ్మేసుకున్నారు. జరిగిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మహారాష్ట్రలోని పయ్‌థాన్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
మహారాష్ట్రలోని పయ్‌థాన్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఇద్దరమ్మాయిల్లో.. ఒక అమ్మాయి సదరు ప్రియుడితో కలిసి స్థానిక బస్టాండ్‌కు చేరుకుంది. ఆ సమయంలో మరో అమ్మాయి కూడా అక్కడే ఉంది. వీళ్లిద్దరినీ గమనించి.. దగ్గరకు వచ్చి నిలదీసింది. దాంతో ఈ విషయం ఆ ఇరువురికి తెలిసింది. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు గొడవకు దిగారు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇద్దరూ కొట్టుకుంటుండగా..సదరు ప్రేమికుడు అక్కడ్నుంచి స్మార్ట్‌గా ఎస్కేప్ అయ్యాడు. విషయం పోలీసులకు చేరటంతో …ఆ ఇద్దరు అమ్మాయిలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.




మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి