AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మొసళ్లు చుట్టుముట్టినా ప్రాణాలతో బయటపడ్డాడు.. గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కడుతున్న సీన్

ఒక చిన్న పిల్లవాడు నీళ్లలో మునిగిపోతూ, ప్రాణాల కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తాడు. అయితే ఏదో ఒకవిధంగా తనను తాను కాపాడుకోవాలనే ఆరాటంతో... భారీగా ప్రవహించే నదిలో మునుగుతూ తేలుతూనే ఉన్నాడు.

Viral Video: మొసళ్లు చుట్టుముట్టినా ప్రాణాలతో బయటపడ్డాడు.. గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కడుతున్న సీన్
River Full Of Crocodiles
Jyothi Gadda
| Edited By: Ram Naramaneni|

Updated on: Aug 27, 2022 | 6:23 PM

Share

Viral Video: మొసళ్లతో నిండిన నదిలో ఒక బాలుడు మునిగిపోతున్న భయనక దృశ్యాలు సోషల్ మీడియా యూజర్లను షాక్‌కు గురిచేస్తున్నాయి. ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేయబడిన ఈ వీడియోలో ఆ బాలుడి పరిస్థితి చివరకు ఏమైంది..? అనేది కనిపించింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో కనిపించింది. మొసలి మాముల్ది కాదు. నీటిలో ఉంటే స్థానంలో బలంతో మదపుటేనుగుని అయినా ఖతం చేస్తుంది. అంత పవర్‌ఫుల్. ఇక మనుషులు దొరికితే కరకర నమిలి మింగేస్తుంది. ఈ క్రమంలోనే బాలుడు భయానక అనుభవాన్ని ఫేస్ చేశాడు. పరమావశాత్తూ నదిలో పడిపోగా.. ఓ మొసలి అతడికి సమీపంగా దూసుకువచ్చింది. ఒక పక్క నీటి ప్లో లో మునిగిపోతానేమో అన్న భయం.. మరోవైపు మొసలి పట్టేస్తుందేమో అని ఆందోళన.. దీంతో ఆ బాలుడు ఉక్కిరిబిక్కరి అయ్యాడు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో..ఒక చిన్న పిల్లవాడు నీళ్లలో మునిగిపోతూ, ప్రాణాల కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తాడు. అయితే ఏదో ఒకవిధంగా తనను తాను కాపాడుకోవాలనే ఆరాటంతో… భారీగా ప్రవహించే నదిలో తేలుతూనే ఉన్నాడు. అదే సమయంలో అతని చుట్టూ మొసళ్ళు ప్రత్యక్షమయ్యాయి. కానీ,అతడి ప్రయత్నం విఫలం కాలేదు..ఆ బాలుడి పట్ల దేవుడు ఉన్నాడనే నమ్మకం నిజమైంది. నదిలో మునిగిపోతున్న బాలుడుని చుట్టుముట్టిన మొసళ్ల నడుమ అతన్ని రక్షించేందుకే అన్నట్టుగా …బాలుడిని రక్షించడానికి రెస్క్యూ టీమ్ అక్కడకుచేరింది.

ఇవి కూడా చదవండి

హుటాహుటినా పడవలో వచ్చిన రెస్క్యూ టీం.. బాలుడిని చేరుకుంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందం బాలుడిని మొసళ్ల బారిన పడకుండా మెరుపు వేగంతో అతన్ని పడవలోకి లాగేశారు. దాంతో బాలుడు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు..సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో చంబల్ నదికి చెందినదనదిగా చెబుతున్నారు నెటిజన్లు. కానీ,ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు.

ఈ వీడియో వైరల్‌గా మారింది. రెస్క్యూ టీమ్ బాలుడిని రక్షించడానికి సకాలంలో చేసిన ప్రయత్నాలను ప్రజలు ప్రశంసించారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, “ఇది నిజమైన వీరోచిత పోరాటం అన్నారు. రెస్క్యూ టీమ్‌కి సెల్యూట్‌ అంటూ కామెంట్ చేశారు.

మరిన్నిట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి