Viral Video:జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వింత సంఘటన.. స్నేహమంటే ఇదేరా అంటున్న కోతి, పిల్లి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లిలో ఈ వింత ఘటన చోటు వెలుగు చూసింది. ఓ కోతి బుల్లి పిల్లి కూనను ఆదరించింది. అది ఎటువెళితే అటు

Viral Video:జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వింత సంఘటన.. స్నేహమంటే ఇదేరా అంటున్న కోతి, పిల్లి
Monkey
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 26, 2022 | 8:13 PM

Viral Video Today: సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి.. అందులో కొన్ని నెటిజన్లను నవ్విస్తుంటే.. మరి కొన్ని.. ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంకొన్ని వీడియోలు ఆలొచింపజేస్తాయి. ముఖ్యంగా జంతువులు వాటి జాతి వైర్యం మర్చిపోయి స్నేహం చేస్తున్న దృశ్యాలు చాలానే ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంటాయి. అలాంటి వీడియోలుచూసిన నెటిజన్లు వాటికి ఫిదా అవుతుంటారు. అలాంటిదే ఇక్కడ మరో వీడియో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఓ కోతి, బుల్లి పిల్లి పిలను చేరదీసిన దృశ్యం అక్కడి స్థానికుల్ని ఆకట్టుకుంది. వాటి స్నేహం, అప్యాయతను వీడియోలు తీసిన స్థానికులు సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.దాంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లిలో ఈ వింత ఘటన చోటు వెలుగు చూసింది. ఓ కోతి బుల్లి పిల్లి కూనను ఆదరించింది. అది ఎటువెళితే అటు పిల్లిపిల్లను వెంటే తీసుకెళ్తోంది. ఆ రెండు ఒకే దగ్గర కలిసి ఉండటం, కోతి పిల్లికూనను ఎత్తుకొని అటు ఇటు తిప్పడం చూపరులకు కనువిందు చేస్తుంది.

జాతి వైరాన్ని మర్చిపోయి ఒకదానికి ఒకటి తోడుగా ఉంటున్నాయి. రక్త సంబంధీకులే కలిసి ఉండలేకపోతున్న ఈ రోజుల్లో రెండు విభిన్న జాతుల జంతువులు ఇలా కలిసి తిరగటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్నేహం అనేది మరే దేనితోనూ పోల్చలేని అమర బంధం అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి