Viral News: అంత్యక్రియల్లో సజీవంగా లేచిన చిన్నారి.. ఆస్పత్రికి తరలించిన బంధువులకు ఊహించని షాక్‌..!

వైద్యులు డీహైడ్రేషన్‌కు గురైనట్టుగా చెప్పి వైద్యం చేశారు. అనంతరం బాలికను ఇంటికి తరలించారు. ఆ తర్వాత మళ్లీ బాలిక ఆరోగ్యం విషమించడంతో తల్లిదండ్రులు చిన్నారిని అదే ఆస్పత్రికి తరలించారు.

Viral News: అంత్యక్రియల్లో సజీవంగా లేచిన చిన్నారి.. ఆస్పత్రికి తరలించిన బంధువులకు ఊహించని షాక్‌..!
Mexican Girl
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 26, 2022 | 7:06 PM

Viral News: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మూడేళ్ల చిన్నారి కొనప్రాణంతో ఉండగానే చనిపోయిందని తేల్చేశారు. దాంతో ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు, బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ, అంతలోనే వారికి ఊహించని సీన్‌ ఎదురైంది. అంత్యక్రియల సమయంలో చిన్నారి హఠాత్తుగా మేల్కొని అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో అక్కడున్న వారంతా విస్తూ పోయారు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మెక్సికోలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

మెక్సికోలో 3 ఏళ్ల చిన్నారి గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. విపరీతమైన కడుపు నొప్పి, జ్వరం, వాంతుల కారణంగా చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆగస్టు 17న స్వగ్రామంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు డీహైడ్రేషన్‌కు గురైనట్టుగా చెప్పి వైద్యం చేశారు. అనంతరం బాలికను ఇంటికి తరలించారు. ఆ తర్వాత మళ్లీ బాలిక ఆరోగ్యం విషమించడంతో తల్లిదండ్రులు చిన్నారిని అదే ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు బాలిక మృతి చెందినట్లు తెలిపారు. దాంతో చిన్నారిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. ఆ మరుసటి రోజున అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అప్పుడే షాకింగ్ సంఘటన జరిగింది.

ఆచారాలు పూర్తి చేస్తున్న క్రమంలోనే చిన్నారి కళ్ళలో కదలికలు కనిపించాయి. వెంటనే శవపేటికను తెరిచి పరిశీలించగా చిన్నారి పల్స్ ఉన్నట్లు తేలింది. ఆ వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు ప్రకటించారు. ఓ చిన్నారి రెండోసారి మృతి చెందడం విచిత్రమే కాదు దిగ్భ్రాంతిని కూడా కలిగిస్తోంది. ఓ వైపు కేసు దర్యాప్తు, మరోవైపు పోస్టుమార్టం నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి