Diabetes Diet: షుగర్ భాదితులకు ఊరట.. ఈ మూడు కూరగాయలు ఇన్సులిన్‌గా పనిచేస్తాయి.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేస్తాయి..

డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక, జీవక్రియ వ్యాధి. ఇది రక్తంలో చక్కెర పెరుగుదల లేదా తగ్గుదల ద్వారా ప్రభావితమవుతుంది. మధుమేహం వచ్చిన వాళ్లు కొన్ని చిట్కాలని పాటించాలి. అప్పుడు రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

Diabetes Diet: షుగర్ భాదితులకు ఊరట.. ఈ మూడు కూరగాయలు ఇన్సులిన్‌గా పనిచేస్తాయి.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ చేస్తాయి..
Diabetes Diet Tips
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 26, 2022 | 7:44 PM

Diabetes: ఈ రోజుల్లో మధుమేహం సర్వసాధారణమైపోయింది. డయాబెటిస్‌ అంటే ఇది అని ఖచ్చితంగా చెప్పలేం.. ఎందుకంటే.. మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచేలా లేదంటే తగ్గించేదిగా ఉంటుంది. డయాబెటిస్ చికిత్స చేయలేని వ్యాధి. కానీ కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఆహారంతో పాటు, మీ జీవనశైలి కూడా మధుమేహాన్ని ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక, జీవక్రియ వ్యాధి. ఇది రక్తంలో చక్కెర పెరుగుదల లేదా తగ్గుదల ద్వారా ప్రభావితమవుతుంది. మధుమేహం వచ్చిన వాళ్లు కొన్ని చిట్కాలని పాటించాలి. అప్పుడు రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

మధుమేహాన్ని నియంత్రించే మార్గాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మధుమేహం గురించి అవగాహన లేకపోవడం కారణంగా చాలా మంది ఊబకాయం, మూత్రపిండాల సమస్యల బారినపడుతుంటారు..గుండె జబ్బుల వంటి తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో డయాబెటిస్ డైట్ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు.. ఆహారంలో అధిక ఫైబర్, కాంప్లెక్స్ పిండి పదార్థాలు, ప్రొటీన్ల సమతుల్య మిశ్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఆహారంలో కొన్ని ఆకుపచ్చ, ఆకు కూరలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంలో కూడా అద్భుత ప్రయోజనం ఉంటుంది.

ఒక అధ్యయనం ప్రకారం, వారి ఆహారంలో ఆకుకూరలను ఎక్కువగా చేర్చుకునే వ్యక్తులు టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తేలింది. ప్రతి రోజు ఆకుపచ్చ కూరలు, ఆకుకూరలు తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ 14 శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. వీటిలో ముఖ్యంగా కొన్ని కూరగాయలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. అవేంటంటే…

ఇవి కూడా చదవండి

ఈ 3 కూరగాయలు షుగర్‌ బాధితులు తమ ఆహారంలో తప్పక చేర్చుకోవాలి.. 1) బచ్చలి కూర… పిండిపదార్థం లేని మధుమేహానికి అనుకూలమైన కూరగాయ. మీరు మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. బచ్చలికూరలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను నిరోధిస్తుంది. బచ్చలికూర కూడా చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. పాలీఫెనాల్స్, విటమిన్ సి అధిక సాంద్రత, రెండూ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో పనిచేస్తాయి. . బచ్చలికూరలో అధిక మొత్తంలో మెగ్నీషియం కూడా ఉంటుంది. ఇది కూడా షుగర్‌ లెవల్స్‌ని కంట్రోల్‌ చేస్తుంది.

2) క్యాబేజీ.. క్యాబేజీలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మధుమేహంలో రక్తాన్ని స్థిరీకరించడంలో సహాయపడుతుంది. వంట చేయడానికి ముందు వాటిని శుభ్రంగా కడగాలి. మీరు వాటిని ఉడకబెట్టిన పులుసు, కూరలు, సలాడ్లలో తీసుకోవచ్చు.

3. కాలే.. కాలే కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా గుండె జబ్బులను నియంత్రిస్తుంది. కాలేలో ఉండే బైల్ యాసిడ్ సీక్వెస్ట్రెంట్స్ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గింస్తుంది. శరీరంలో పెరిగిన ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచకుండా నిరోధిస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..