Health: రాత్రంతా నిద్రపోయినా.. పగటి పూట ఆవలింతలు వేధిస్తున్నాయా.. ఈ టిప్స్ మీ కోసమే

ఆరోగ్యంగా (Health) ఉండేందుకు నిద్ర చాలా అవసరం. శరీరానికి, మెదడుకు సరైన విశ్రాంతి ఇస్తే తర్వాతి రోజు చురుగ్గా పని చేస్తాం. కానీ మారిపోతున్న జీవన విధానం వల్ల నిద్రపోయే భాగ్యం కలగడం లేదు. అయితే కొందరు ప్రశాంతంగా...

Health: రాత్రంతా నిద్రపోయినా.. పగటి పూట ఆవలింతలు వేధిస్తున్నాయా.. ఈ టిప్స్ మీ కోసమే
Sleeping
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 26, 2022 | 9:52 PM

ఆరోగ్యంగా (Health) ఉండేందుకు నిద్ర చాలా అవసరం. శరీరానికి, మెదడుకు సరైన విశ్రాంతి ఇస్తే తర్వాతి రోజు చురుగ్గా పని చేస్తాం. కానీ మారిపోతున్న జీవన విధానం వల్ల నిద్రపోయే భాగ్యం కలగడం లేదు. అయితే కొందరు ప్రశాంతంగా నిద్రపోయినా ఉదయం త్వరగా నిద్ర లేవలేరు. వారికి బద్ధకంగా, అలసటగా అనిపిస్తుంది. రాత్రంతా పడుకున్నా.. ఉదయం కూడా వారికి మత్తుగానే ఉంటుంది. దీంతో ఏ పని మీద ఇంట్రెస్ట్ పెట్టలేరు. ఆవలింతలు, నీరసంతో తూలుతుంటారు. కొంచెం సేపు నిద్రపోతే బాగుండు అని అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉంటే ఆలస్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు. పగటి పూట, పనులు చేసే సమయంలో నిద్ర (Sleeping) మత్తు అనిపిస్తే యాక్టివ్‌గా ఉండటానికి డైలీ లైప్‌స్టైల్‌లో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే త్వరగా నిద్ర లేవాలి. రోజూ ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తే అరోగ్యంగా ఉండటంతో పాటు మనస్సు ప్రశాంగా, మెదడు చురుకుగా ఉంటుందన్నారు. ప్రతిరోజూ 20 -25 నిమిషాలు నూనెతో బాడీ మాసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల నాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలాంటివి చేయడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఉండొచ్చు.

మెడిటేషన్ చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గుతుంది. దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. జ్ఞాపకశక్తి, స్పష్టత, ఏకాగ్రత వృద్ధి చెందుతాయి. అంతే కాకుండా రోజు వేడి, తాజా ఆహారాన్ని తీసుకోవాలి. ఆయుర్వేదంలో, ప్రతి రోజూ రెగ్యులర్‌ సమయంలో వేడి ఆహారం తీసుకుంటే ఔషదంతో సమానమని పేర్కొన్నారు. వేడి ఆహారం శరీరం పోషకాలను గ్రహిస్తుంది. దీని వల్ల శరీరం యాక్టివ్‌గా ఉంటుంది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి