Viral: ఎలా వస్తాయిరా బాబూ మీకు ఇలాంటి ఐడియాలు.. ఎగ్జామ్ కోసం మనోడు ఏం చేశాడో తెలిస్తే షాకే..

పరీక్షల్లో కాపీ (Copy) కొట్టడం మనకు తెలిసిందే. మాస్ కాపీయింగ్, హైటెక్ కాపీల గురించి విన్నాం. కానీ ఇప్పుడు జరిగిన ఓ కాపీ గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం పక్కా. ఎలాగైనా పాస్ అవ్వాలనో లేక మంచి మార్కులు, ర్యాంకులు..

Viral: ఎలా వస్తాయిరా బాబూ మీకు ఇలాంటి ఐడియాలు.. ఎగ్జామ్ కోసం మనోడు ఏం చేశాడో తెలిస్తే షాకే..
stuent
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 26, 2022 | 4:48 PM

పరీక్షల్లో కాపీ (Copy) కొట్టడం మనకు తెలిసిందే. మాస్ కాపీయింగ్, హైటెక్ కాపీల గురించి విన్నాం. కానీ ఇప్పుడు జరిగిన ఓ కాపీ గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం పక్కా. ఎలాగైనా పాస్ అవ్వాలనో లేక మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవాలనో ఎవరూ చేయని విధంగా కాపీకి పాల్పడ్డాడు ఓ యువకుడు. రైల్వేలో ఉద్యోగం తెచ్చుకోవాలని ఓ యువకుడు కొత్త మోసానికి తెరలేపాడు. తను పరీక్ష రాస్తే ఉద్యోగం రాదని భావించి, తన స్నేహితుడితో పరీక్ష రాయించాలనుకున్నాడు. ఇందుకోసం ఎవ్వరూ ఇప్పటివరకు చేయని విధంగా చేయాలనుకున్నాడు. బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ సమయంలో అధికారుల నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా తన బొటనవేలి చర్మాన్ని బ్లేడుతో కోసుకుని, అతని ఫ్రెండ్ బొటనవేలికి అంటించాడు. ఇక ధీమాగా ఉద్యోగం వచ్చేసినట్టేననుకున్నాడు. స్నేహితుడితో కలిసి ఎగ్జామ్ సెంటర్ (Exam) కు వెళ్లాడు. స్నేహితుడు లోపలికి వెళ్లాడు. బయోమెట్రిక్‌ యంత్రంతో వేలి ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుండగా ఆకస్మాత్తుగా ఆ చర్మం ఊడిపోయింది. దీంతో వారి బండారం బయటపడింది. బిహార్‌ లోని ముంగెర్‌ జిల్లాకు చెందిన మనీశ్‌ కుమార్‌.. ప్రభుత్వ ఉద్యోగాలను సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో తన స్థానంలో పరీక్ష రాయాలని స్నేహితుడికి చెప్పాడు. అతను ఒప్పుకోకపోవడంతో ఏదో ఒకటి చెప్పి ఒప్పించాడు. ముందస్తు ప్లాన్ లో భాగంగా మనీశ్‌ తన బొటన వేలిని వేడి పెనంపై పెట్టాడు. దీంతో ఆ చర్మం ఉబ్బింది. ఆ చర్మాన్ని బ్లేడ్ తో కోసి, స్నేహితుడు రాజ్యగురు బొటన వేలికి అంటించాడు.

Copy In Exam

Copy In Exam

అనంతరం పరీక్ష రాసేందుకు మనీజ్, రాజ్యగురులు ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లారు. పరీక్షా కేంద్రంలో రాజ్యగురు బయోమెట్రిక్‌ తో వేలిముద్ర వేశాడు. అయితే అది మనీశ్ వివరాలతో సరిపోలలేదు. దీంతో అధికారులకు అనుమానం వచ్చింది. రాజ్యగురు బొటనవేలిపై శానిటైజర్‌ స్ప్రే చేశారు. దీంతో అతికించిన చర్మం ఊడి వచ్చింది. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ తో అధికారులు కంగుతిన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మనీశ్, రాజ్యగురు ఇద్దరినీ అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే