Hyderabad: సాయంత్రం 7 గంటలకు కర్ఫ్యూ సడలింపు.. యథావిథిగా వ్యాపారాలు.. ఆంక్షలు అతిక్రమిస్తే మాత్రం..

హైదరాబాద్ (Hyderabad) లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) వెల్లడించారు. నాలుగైదు రోజులుగా పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఈరోజు శుక్రవారం...

Hyderabad: సాయంత్రం 7 గంటలకు కర్ఫ్యూ సడలింపు.. యథావిథిగా వ్యాపారాలు.. ఆంక్షలు అతిక్రమిస్తే మాత్రం..
Cp Cv Anand
Follow us

|

Updated on: Aug 26, 2022 | 5:03 PM

హైదరాబాద్ (Hyderabad) లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) వెల్లడించారు. నాలుగైదు రోజులుగా పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఈరోజు శుక్రవారం కాబట్టి ఏదో జరుగుతుందని అందరూ భావించారని, కానీ ఇవాళ అంతా ప్రశాంతంగా సాగిపోయిందని చెప్పారు. అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన వాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని, అందుకే ఇవాళ ప్రశాంతంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ లో గొడవలు సృష్టించి, ఏం చేయాలనుకుంటున్నారో అందరికీ తెలుసని చెప్పారు. నాలుగైదు రోజులు పోలీస్ అధికారులు రాత్రీ, పగలు కష్టపడి నిఘా ఏర్పాటు చేసి, పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారని చెప్పారు. సోషల్ మీడియా, డిజిటల్, యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని వీడియోలతో అలజడి సృష్టించాలనుకున్నారని, అలాంటి ఛానల్స్ ను గుర్తించి, నోటీసులిచ్చామన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిని వదిలిపెట్టేది లేదని, వారికి సంబంధించిన అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని సీపీ ఆనంద్ పేర్కొన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని, సాయంత్రం 7 గంటల కర్ఫ్యూ సడలిస్తామని చెప్పారు. వ్యాపారులు యథావిథిగా పని చేసుకోవచ్చని, ఉద్రిక్త సంఘటనలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని సీపీ ఆనంద్ హెచ్చరించారు.

ఓల్డ్ సిటీలో అంతా ప్రశాంతగా ఉంది. శుక్రవారం ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అంతా ప్రశాంతంగా సాగిపోయింది. ఆ విషయం మాకు తెలుసు. అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన వాళ్లను అదుపులోకి తీసుకున్నాం. సోషల్ మీడియాలో అలజడి సృష్టించాలని భావించిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఈరోజు నుంచి వ్యాపార సముదాయాలు యాథావిథిగా సాగుతాయి.

– సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ

ఇవి కూడా చదవండి

మరోవైపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ కారణంగా వరంగల్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగసభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధిత ఉత్తర్వులను జారీ చేశారు పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ. ప్రజా భద్రత, ప్రశాంతతను కాపాడాలనే ఉద్దేశ్యంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం