Cyberabad: ఇక్రిశాట్ ముందు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తి.. తనిఖీలు చేయగా పోలీసులు షాక్
ఈజీ మనీ కోసం కొందరు అక్రమార్కులు యువత భవిష్యత్‌ను ఛిద్రం చేస్తున్నారు. కేసులు పెట్టి జైల్లో వేసినా మళ్లీ బయటకు వచ్చి అదే దందా కంటిన్యూ చేస్తున్నారు.
Telangana: మత్తు బారిన పడి యువత చిత్తు అవుతుంది. బంగారం లాంటి భవిష్యత్‌ను ఈ మాదకద్రవ్యాల ఉచ్చులో పడి పాడు చేసుకుంటున్నారు కొందరు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతున్నాయి. పోలీసులు కేసులు పెట్టి లోపలేసినా.. బయటకు వచ్చి అదే దందా కంటిన్యూ చేస్తున్నారు పెడ్లర్స్. ఈజీగా మనీ వస్తుండటంతో తగ్గేదే లే అంటూ గలీజ్ పనికే పూనుకుంటున్నారు. తాజాగా సైబరాబాద్ రామచంద్రపురం(Ramachandrapuram) పోలీస్ స్టేషన్ పరిధిలో కొకైన్ పట్టబడటం కలకలం రేపుతుంది. రామచంద్రపురం ఇక్రిశాట్ ముందు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తి నుంచి 13 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు SOT పోలీసులు. అరెస్ట్ చేసిన వ్యక్తిని మహ్మద్ అష్రాఫ్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి రూ. 64,330 క్యాష్, రెండు పెన్ డ్రైవ్స్, 100 ప్యాకింగ్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో అష్రాఫ్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో NDPS(Narcotic Drugs and Psychotropic Substances) యాక్ట్ కింద కేసు నమోదయ్యింది. నైజీరియన్ నుంచి అతను డ్రగ్స్ కొనుగోలు చేసి స్థానికంగా అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..