TS EAMCET: హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్న ఇంజనీరింగ్ సీట్లు.. నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాలేజీ యాజమాన్యాలు..

TS EAMCET: తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఎంసెట్‌ ఫలితాలు కూడా రాకముందే మేనేజ్‌మెంట్ కోట సీట్ల అమ్మకాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఓ వైపు కౌన్సిలింగ్ జరుగుతుండగానే మరోవైపు బీ క్యాటగిరీ సీట్లను..

TS EAMCET: హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్న ఇంజనీరింగ్ సీట్లు.. నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాలేజీ యాజమాన్యాలు..
colleges
Follow us
Vidyasagar Gunti

| Edited By: Anil kumar poka

Updated on: Sep 19, 2022 | 1:33 PM

TS EAMCET: తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఎంసెట్‌ ఫలితాలు కూడా రాకముందే మేనేజ్‌మెంట్ కోట సీట్ల అమ్మకాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఓ వైపు కౌన్సిలింగ్ జరుగుతుండగానే మరోవైపు బీ క్యాటగిరీ సీట్లను భర్తీని ప్రైవేటు కాలేజీలు చాటుగా కానిచేస్తున్నాయి. ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ కంటే ముందే దాదాపు పూర్తైనట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నత విద్యామండలి ఆధారాలతో సహా ఫిర్యాదు వస్తే తప్ప ఏం చేయలేని పరిస్థితి ఉందని చేతులెత్తేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 180 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వీటిలో లక్షా 11 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు, మిగిలిన 30 శాతం సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేస్తారు. అయితే బీ కేటగిరీ కింద మేనేజ్ మెంట్ కోటాలోని సీట్లను ఉన్నత విద్యామండలి గైడ్ లైన్స్ విడుదల చేసిన తర్వాత అడ్మిషన్లు చేసుకోవాలి. కానీ సర్కారు గైడ్ లైన్స్ కంటే ముందే నిబంధనలకు విరుద్ధంగా సీట్లను కొనుగోలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది సుమారు 31 వేల సీట్లు మేనేజ్ మెంట్ కోటాలో భర్తీ కానున్నాయి. వీటీకోసం మేనేజ్ మెంట్లు ఏఏ కోర్సుల్లో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలియజేస్తూ ఉన్నత విద్యా మండలి నిబంధనల ప్రకారం ప్రకటనలు ఇవ్వాలి. వాటికి వచ్చే అప్లికేషన్లలో మెరిట్ ప్రకారం విద్యార్థులకు సీట్లను కేటాయించాలి. ఫీజు కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లే వసూలు చేయాలి. కానీ ఇదంతా జరుగుతుందా అంటే శూన్యమనే చెప్పాలి. మేనేజ్ మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ రాకముందే చాటుగా ప్రక్రియ పూర్తైపోతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముందే బుక్ చేసుకున్న వారి పేరుతో అడ్మిషన్లు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోట సీట్లు నిండిపోయినట్లు సమాచారం.

ఇక ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 1,56,812 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు హాజరుకాగా ఇందులో 80.41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 80,575మంది రాస్తే 88.34శాతం క్వాలిఫై అయ్యారు. దీంతో సీట్లకంటే ఎక్కువమంది ఉండటం, ర్యాంకు మంచిది రాలేదు సరైన కాలేజీలో దొరకదు అనుకునే వారు ముందే మేనేజ్ మెంట్ కోటా సీట్ల కోసం కాలేజీలకు పరుగులు తీశారు. కాలేజీలు కూడా ముందుగానే సీట్లు బుక్ చేసుకోవాలని సూచించడంతో కాలేజీల్లో మేనేజ్ మెంట్ సీట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మేనేజ్ మెంట్ కోటా సీట్ల కోసం ఆయా కాలేజీలు డొనేషన్లు కూడా భారీగా వసూలు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అలాంటి సీట్లు చెల్లవు..

నిబంధనలకు విరుద్ధంగా షెడ్యూల్‌ కంటే ముందే భర్తీ చేసే సీట్లను చెల్లని వాటిగా గుర్తిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే సీట్లను భర్తీ చేయాలని ఆయన కాలేజీలకు సూచించారు. ముందుగా చేసే అడ్మిషన్లను పరిగణలోకి తీసుకోమని ఆయన స్పష్టం చేశారు. నాలుగైదు రోజుల్లో మేనేజ్ మెంట్ కోటా సీట్ల భర్తీపై గైడ్ లైన్స్, నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అదే విధంగా యూనివర్సిటీ కానీ ప్రభుత్వం కానీ అనుమతిలేని ఏ కాలేజీ కూడా అడ్మిషన్లు చేపట్టరాదని.. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా కాలేజీకి అనుమతి, గుర్తింపు ఉందా లేదా చెక్ చేసుకోని కాలేజీ అడ్మిషన్లు తీసుకోవాలని ప్రొఫెసర్ లింబాద్రి సూచించారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ