Fact Check: భారత సైన్యంలోకి నేపాలీ గూర్ఖాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వార్తలో నిజమెంతా.?
Fact Check: 'నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టి వస్తుంది'.. సోషల్ మీడియాకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. సమాచార మార్పిడికి ఉత్తమ సాధనంగా ఉపయోగపడే సోషల్ మీడియా అబద్ధాల ప్రచారానికి కూడా అడ్డాగా మారుతోంది...
Fact Check: ‘నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరు చుట్టి వస్తుంది’.. సోషల్ మీడియాకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. సమాచార మార్పిడికి ఉత్తమ సాధనంగా ఉపయోగపడే సోషల్ మీడియా అబద్ధాల ప్రచారానికి కూడా అడ్డాగా మారుతోంది. ప్రతీ రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని నిజమైతే మరికొన్ని అబద్ధాలు ఉంటాయి. ఇలా ఇటీవల ఫేక్ న్యూస్ వ్యాప్తి బాగా పెరిగిపోయింది. ఎలా పుట్టుకొస్తాయో కూడా తెలియని కొన్ని వార్తలు నెటిజన్లను కన్ఫ్యూజ్‌కు గురి చేస్తుంటాయి.
తాజాగా ఇలాంటి ఓ వార్తే నెట్టింట వైరల్ అవుతోంది. కేంద్రం ఇటీవల ఇండియన్ ఆర్మీలో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా నేపాల్‌కు చెందిన గూర్ఖాలను భారత సైన్యంలోకి తీసుకునేందుకు కసరత్తులు చేస్తోంది అనేది సదరు వార్త సారాంశం. అయితే ఈ వార్త ట్రెండింగ్ కావడంతో ఎట్టకేలకు ఇండియన్ ఆర్మీ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని, నెట్టింట వైరల్ అవుతోన్న వార్తలన్నీ అవాస్తవమని ఖండించారు. ఇందులో భాగంగా వివరణ ఇస్తూ ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చేసింది. దీంతో కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది.
Fake messages are being circulated on Social Media about the recruitment of Gorkhas from Nepal in the Indian Army: Indian Army pic.twitter.com/O6mHyAnc7d
— ANI (@ANI) August 26, 2022
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..