Results: రేపే రిజల్ట్స్.. మీ ఫలితాల్ని చెక్ చేసుకోండిలా..
తెలంగాణలో ఏంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐ-సెట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం..
Results: తెలంగాణలో ఏంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐ-సెట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 3గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్టు కన్వీనర్ ఆచార్య కె.రాజిరెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జులై 28న ఈపరీక్ష జరగ్గా.. తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు కేంద్రాల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 76వేల160మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఐసెట్ ప్రిలిమినరీ ‘కీ’ని ఈనెల 4వ తేదీన విడుదల చేశారు.
అభ్యర్థులు ఫలితాలను అభ్యర్థులు మొదటగా ఈలింక్ ను క్లిక్ చేసి ఐసెట్ కు సంబంధించిన వెబ్ సైట్ ను సందర్శించాలి. అక్కడ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. వెబ్ సైట్ ను ఓపెన్ చేయగానే ఐసెట్ రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేస్తే ర్యాంకు కార్డు డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా ర్యాంకు కార్డు ప్రింటెడ్ కాపీ పొందవచ్చు. మద్యాహ్నం మూడు గంటల తర్వాత ఈ లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..