AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Raja Singh: పీడీ యాక్ట్‌పై సుప్రీంకోర్టుకు రాజాసింగ్‌.. న్యాయవాది రఘునందన్‌రావు పిటిషన్‌..

పీడీయాక్ట్‌ కేసులో అరెస్టయిన MLA రాజాసింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు పెట్టిన పీడీయాక్ట్‌పై న్యాయపోరాటానికి సిద్దమయ్యారు. అక్రమంగా పోలీసులు తనపై ఈ చట్టాన్ని ప్రయోగించారని సుప్రీకోర్టుకు విన్నవించారు.

MLA Raja Singh: పీడీ యాక్ట్‌పై సుప్రీంకోర్టుకు రాజాసింగ్‌.. న్యాయవాది రఘునందన్‌రావు పిటిషన్‌..
Mla Raja Singh
Sanjay Kasula
|

Updated on: Aug 26, 2022 | 9:51 PM

Share

దొంగతనాలు, అల్లర్లకు పాల్పడే రౌడీషీటర్ల మీద అమలు చేసే పీడీయాక్ట్‌ చట్టాన్ని తనపై తెలంగాణ పోలీసులు అన్యాయంగా చట్టాన్ని ప్రయోగించారని ఎమ్మెల్యే రాజాసింగ్‌(MLA Raja Singh) సుప్రీంకోర్టుకు వెళ్లారు. రాజాసింగ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రఘునందన్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఎమ్మెల్యే రాజాసింగ్‌ను రెండు కేసుల్లో అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనపై పీడీ యాక్ట్‌ పెట్టారు. ఫిబ్రవరి 19, 2022న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మంగళ్‌హాట్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏప్రిల్‌ 12న షాహినాయత్‌గంజ్‌లో మరో కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల వేళ, శ్రీరామ నవమి సందర్భంగా వివాదాస్పద కామెంట్స్ చేశారని ఈ ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు రిజిస్టర్ చేశారు. ఒకరోజు ముందు 41 (A) సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.

గురువారం మధ్యాహ్నం తర్వాత అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. పీడీయాక్ట్‌ కింద అరెస్టు చేసినట్లు ప్రకటించారు పోలీసులు. ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమైంది. ముందు ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో పాతబస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. రెండోసారి మాత్రం పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేశారు.

మరోవైపు పాతబస్తీలో శుక్రవారం టెన్షన్‌ ప్రశాంతంగా ముగిసింది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. రాజాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం పాతబస్తీ మక్కామసీదు, శాలిబండ, మీర్‌ఆలం ప్రాంతంలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని భావించిన పోలీసులు..పెద్దయెత్తున బలగాలను మోహరించారు. ప్రార్థనల నుంచి బయటకొచ్చేవారిని గుంపులుగా గుమికూడకుండా అక్కడి నుంచి పంపేశారు పోలీసులు.

ఓల్డ్ సిటీలో అంతా ప్రశాంతగా ఉందని చెప్పారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. శుక్రవారం ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ముందుగానే అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన వాళ్లని అదుపులోకి తీసుకున్నామన్నారు సీపీ సీవీ ఆనంద్. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంకా బందోబస్తు కొనసాగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం