Chennai: 9వ తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్.. సీసీ ఫుటేజీలో షాకింగ్‌ దృశ్యాలు..!

రోడ్డుపై పరిగెడుతుండగా, మార్గమధ్యంలో ఓ మహిళ బాలికను రక్షించి వెల్లవేడు పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది. బాలిక చెప్పిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా

Chennai: 9వ తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్.. సీసీ ఫుటేజీలో షాకింగ్‌ దృశ్యాలు..!
child harassment
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 26, 2022 | 8:42 PM

Chennai: 9వ తరగతి చదువుతున్న 16ఏళ్ల బాలికపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బాలికపై కన్నేసిన కామాంధుడు ఆమెను కిడ్నాప్‌ చేశాడు. అఘంతకుడి చెర నుంచి బాలిక తప్పించుకుని రోడ్డుపై పరిగెడుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈఘటన తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే…

తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా అవడి సమీపంలో పట్టాబ్రమ్ ప్రాంతంలో నివసిస్తుంది బాధితురాలి కుటుంబం. బాధిత బాలిక ఆమె సోదరి ఇద్దరూ పట్టాబ్రంలోని ఓ పాఠశాలలో చదువుతున్నారు. ఈ క్రమంలోనే బాధిత బాలికకు పట్టాబ్రంలోని పాఠశాలలో చదవడం ఇష్టం లేకదని తండ్రికి చెప్పింది. తనను స్కూల్‌ మార్చాలని మారాం చేస్తూ… గత 10 రోజులుగా ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక..గురువారం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ప్రయత్నం విఫలం కావటంతో తల్లిదండ్రులు తిడతారనే భయంతో…ఇంట్లోంచి వెళ్లిపోయింది. IAF రోడ్డు వెంబడి నడుస్తూ వెళ్తుండగా…గుర్తుతెలియని ఆటోడ్రైవర్ బాలికను బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నాడు. అక్కడికి 3కిలోమీటర్ల దూరంలోని వెల్లవేడు ప్రాంతంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎలాగోలా బాలిక అక్కడి నుంచి పారిపోయింది.

రోడ్డుపై పరిగెడుతుండగా, మార్గమధ్యంలో ఓ మహిళ బాలికను రక్షించి వెల్లవేడు పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది. బాలిక చెప్పిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని బట్టి పట్టబ్రం టీచర్స్ కాలనీకి చెందిన రామకృష్ణన్ డబ్ల్యూ/38 బాలికను అపహరించినట్లు తేలింది. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తిరువళ్లూరు మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి పుఝల్ జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిజాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి