NSU Jobs: తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

NSU Recruitment 2022: తిరుపతిలో ఉన్న నేషనల్‌ సంస్కృత విశ్వవిదాల్యంలో (NSU)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ యూనివర్సిటీలో..

NSU Jobs: తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ పోస్టులు.. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Nsu Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 26, 2022 | 7:44 PM

NSU Recruitment 2022: తిరుపతిలో ఉన్న నేషనల్‌ సంస్కృత విశ్వవిదాల్యంలో (NSU)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఈ యూనివర్సిటీలో పలు విభాగాల్లో ఉన్న గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 39 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* సాహిత్యం, ఇంగ్లిష్‌, హిందీ, హిస్టరీ, ఇండియన్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నిక్స్‌, మిమంస, ఆగమ, యోగా, జ్యోతిష, కంప్యూటర్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ విభాగాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంఫిల్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌/ స్లెట్‌/ సెట్‌ అర్హత పొందాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేస్తారు.

* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంటర్వ్యూలను నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి అడ్రస్‌లో 06-09-2022 నుంచి 08-09-2022 తేదీల్లో నిర్వహిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు గౌరవేతనంగా నెలకు రూ. 50,000 అందిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..