Pvt Finance: మరో దారుణం.. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ వేధింపులు తట్టుకోలేక ఇంట్లోనే ఉరివేసుకున్న మహిళ..

గత నెలరోజులుగా ఇన్ స్టాఫండ్ ఫైనాస్స్ వారు వేధిస్తున్నారని, ఈ మధ్య నగరంలోని రాం గోపాల్ పేట్ పి.యస్ నుండి ఫోన్ చేసి మీమీద కంప్లేట్ ఇచ్చారు. వచ్చి కలవమని‌ యస్.ఐ మహిళ కానిస్టేబుల్ ఫోన్ చేశారని,...ఆ వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో ..

Pvt Finance: మరో దారుణం.. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ వేధింపులు తట్టుకోలేక ఇంట్లోనే ఉరివేసుకున్న మహిళ..
child illness
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 26, 2022 | 9:04 PM

Medchal Finance: ఫైనాన్స్‌ వేధింపులు తాళలేక ఆర్థిక బాధలతో ఓ మహిళ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన మేడ్చల్ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక KLR వెంఛర్ లో నివసించే సునీత అనే మహిళ ( 35 ) అర్ధిక‌ భాదలు తాళలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు… మేడ్చల్‌ రాజాబొల్లారం తాండాకు చెందిన మృతురాలు సునీత ఆమె కూతురుతో కలిసి KLR వెంచర్ లో నివాసముంటున్నారు. ఇన్‌స్టాఫండ్‌ ఫైనాన్స్‌ వారి వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాథమిక దర్యాప్తులో మృతురాలు సునీతా అలియాబాద్ చౌరస్తా మేడ్చల్ లో శ్రీ బైక్ జోన్ షోరూం నడిపిస్తోందని తెలిసింది. ఈ క్రమంలోనే ఈ రోజు ఎన్ని సార్లు తనకు ఫోన్ చేసినా సమాధానం లేకపోవడంతో..ఇంటికి‌ వచ్చిన బంధువులు తలుపులు పగలకొట్డి చూడగా సునీత ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయి కనిపించింది.

గత నెలరోజులుగా ఇన్ స్టాఫండ్ ఫైనాస్స్ వారు వేధిస్తున్నారని, ఈ మధ్య నగరంలోని రాం గోపాల్ పేట్ పి.యస్ నుండి ఫోన్ చేసి మీమీద కంప్లేట్ ఇచ్చారు. వచ్చి కలవమని‌ యస్.ఐ మహిళ కానిస్టేబుల్ ఫోన్ చేశారని,…ఆ వేధింపులు తట్టుకోలేక మనస్తాపంతో ఈ రోజు మద్యాహ్నం కూతురు స్కూల్ కి వెళ్ళిన సమయంలో తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా బంధువులు ఆరోపిస్తూ మేడ్చల్ పి.యస్ లో ఫిర్యాదు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్న మేడ్చల్ పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి