AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks : వెల్లుల్లి పొట్టు తీయడానికి కష్టపడుతున్నారా? ఈ ట్రిక్స్‌తో సులభంగా తీయొచ్చు

Garlic Peeling Tips: వెల్లుల్లిని పొట్టు తీయడం చాలా పెద్ద పని. వెల్లుల్లి నుంచి ముందుగా పాయలను వేరు చేయాలి. ఆ తర్వాత వాటి పొట్టును నెమ్మదిగా తీయాలి.ఇలా చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని సులభమైన చిట్కాలు ఏంటో తెలుసుకుందాం..

Kitchen Hacks : వెల్లుల్లి పొట్టు తీయడానికి కష్టపడుతున్నారా? ఈ ట్రిక్స్‌తో సులభంగా తీయొచ్చు
Garlic Peel
Sanjay Kasula
|

Updated on: Aug 26, 2022 | 10:45 PM

Share

వెల్లుల్లి లేనిదే మన భారతీయ వంటకాల్లో రుచి రాదు. ఇది ప్రతీ ఇంటి వంటగదిలో తప్పని సరిగా ఉండాల్సిందే. వెల్లుల్లి వాడకం వల్ల శరీరంలోని అనేక సమస్యలు దూరం అవుతాయి. అందుకే వెల్లుల్లిని చాలా విషయాల్లో ఉపయోగిస్తారు. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, దానిని పొట్టు తీయడం అంత కష్టమవుతుంది. వెల్లుల్లిని పొట్టు తీస్తున్నప్పుడు మీకు కూడా ఇబ్బంది ఉంటే.. మీరు దీని కోసం అనేక రకాల చిట్కాలను అనుసరించవచ్చు. ఈ రోజు  వెల్లుల్లిని పొట్టు తీసేందుకు ఈ చిట్కాల అద్భుతంగా పనిచేస్తాయి. వెల్లుల్లిని పొట్టు తీసే విధానం ఏమిటో తెలుసుకుందామా?

రోలింగ్ పిన్‌…

రోలింగ్ పిన్‌తో వెల్లుల్లిని పొట్టు చాలా సులభంగా తీయోచ్చు. దీన్ని ఉపయోగించి.. మీరు కొన్ని నిమిషాల్లో చాలా పెద్ద మొత్తం వెల్లుల్లి పాయల పొట్టు ఈజీగా తీయవచ్చు. దీన్ని ఉపయోగించడానికి రోలింగ్ పిన్(చపాతీ రోలర్) తీసుకోండి. ఇప్పుడు డౌ బాల్ లాగా వెల్లుల్లి మీద అటు ఇటు తిప్పండి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి పొట్టు త్వరితగతిన పోతుంది.

వేడి నీటితో..

 కత్తితో..

వెల్లుల్లి పొట్టునికి మీరు కత్తిని ఉపయోగించవచ్చు. అయితే, ఇందులో మీకు కొత్తగా ఏమీ కనిపించకపోవచ్చు. అయితే వెల్లుల్లిని పొట్టు తీయడానికి మామూలు కత్తికి బదులుగా పదునైన కత్తిని ఉపయోగించండి. దీని తరువాత, వెల్లుల్లి కొనపై కత్తిని ఉంచడం ద్వారా వెల్లుల్లిని నొక్కండి. ఇలా చేయడం వల్ల వెల్లుల్లి పొట్టు త్వరగా రాలిపోతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం..