AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ గాంధీ తెలిసే తప్పు చేశారు.. కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్

ఢిల్లీ హత్యాచార ఘటనలో బాధితురాలి(9 ఏళ్ల బాలిక) కుటుంబ సభ్యులను వారి ఇంటికెళ్లి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఉదయం ఓదార్చడం తెలిసిందే. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారికి  అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

రాహుల్ గాంధీ తెలిసే తప్పు చేశారు.. కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్
Rahul Gandhi
Janardhan Veluru
|

Updated on: Aug 04, 2021 | 7:25 PM

Share

ఢిల్లీ హత్యాచార ఘటనలో బాధితురాలి(9 ఏళ్ల బాలిక) కుటుంబ సభ్యులను వారి ఇంటికెళ్లి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఉదయం ఓదార్చడం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారికి  అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఫోటోలను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం వివాదాస్పదమవుతోంది.  బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల వివరాలను రాహుల్ గాంధీ బహిర్గతం చేయడం సరికాదని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మండిపడ్డారు. పోస్కో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లోని పలు సెక్షన్లను రాహుల్ ఉల్లంఘించారని ఆరోపించారు. రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను డిమాండ్ చేశారు. పోస్కో యాక్ట్ కింద రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేయాలన్నారు. పోస్కో చట్టం ముందు అందరూ సమానమేనని…ఎవరూ వీఐపీ కాదన్నారు. తాను చేసిన తప్పుకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. తప్పు చేస్తున్నట్లు తెలిసి కూడా బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలను రాజకీయ స్వార్థంతోనే  రాహుల్ ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేశారని ఆరోపించారు. ఢిల్లీ హత్యాచార ఘటనను తన రాజకీయ అజెండా కోసం వాడుకోవాలని రాహుల్ గాంధీ చూస్తున్నారని దుయ్యబట్టారు.

అటు హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల ఫోటోలను రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సీరియస్ అయ్యింది. అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను బహిర్గతం చేయడం ద్వారా రాహుల్ గాంధీ పోస్కో యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపించింది. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది.

ఇదిలా ఉండగా త్వరలోనే ఢిల్లీ హత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యులను ఆ రాష్ట్ర సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కూడా పరామర్శించనున్నట్లు తెలుస్తోంది.

శ్మశానవాటికలో కాటికాపరులే తమ మైనర్ బాలికను రేప్ చేసి హతమార్చినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే తమ ఆమోదం లేకుండానే బాలిక మృతదేహానికి ఆదరాబాదరగా అంత్యక్రియలు నిర్వహించారని ఆరోపిస్తున్నారు. దీనికి కారకులైన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగానూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read..

Shilpa Shetty: దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!

ఈ అబ్బాయిలు చేసే పనికి అమ్మాయిల రియాక్షన్ చూస్తే మతిపోతుంది..! నవ్వకుండా ఉండలేరనుకో..