ఢిల్లీలో ఆ దారుణ ఘటన.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ.. బీజేపీ ఎద్దేవా
ఢిల్లీలో 9 ఏళ్ళ బాలిక రేప్, మర్డర్ ఘటనను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలని వారు కోరుతున్నారని, ఈ తరుణంలో వారికి ఎంతో సాయం అవసరమని ఆయన ఆ తరువాత మీడియా వద్ద పేర్కొన్నారు.
ఢిల్లీలో 9 ఏళ్ళ బాలిక రేప్, మర్డర్ ఘటనను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. తమ కుటుంబానికి న్యాయం జరగాలని వారు కోరుతున్నారని, ఈ తరుణంలో వారికి ఎంతో సాయం అవసరమని ఆయన ఆ తరువాత మీడియా వద్ద పేర్కొన్నారు. ఇందుకు తాను వారికకి అండగా ఉంటానని హామీ ఇచ్చానన్నారు. ఆ బాలిక ఈ దేశ కూతురని ఆయన తన ట్వీట్ లో అభివర్ణించారు. ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే అన్నారు. అయితే బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్రా… రాహుల్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ఇది రాజకీయాలను దిగజార్చే విధంగా ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా రేప్ బాధితురాళ్లు ఉన్నారని, మరి ఆ కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన ఆ రాష్ట్రాలకు ఎందుకు వెళ్లరని పాత్రా ప్రశ్నించారు. పైగా ఢిల్లీ బాధితురాలి ఫోటోను రాహుల్ తన ట్వీట్ లో షేర్ చేయడమేమిటని ప్రశ్నించిన ఆయన..ఇది పోక్సో చట్టాన్ని ఉల్లంఘించడమే అని ఆరోపించారు. దీనిపై రాహుల్ మీద చర్య తీసుకోవాలని పాత్రా డిమాండ్ చేశారు.
ఏమైనా ఈ నగరంలో జరిగిన బాలిక రేప్, మర్డర్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని, నేరస్తులను వెంటనే పట్టుకోవాలని ఆయన పోలీసు శాఖను కోరారు. ఇలా ఉండగా ఢిల్లీ సీఎం. ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ.. ఈ ఘటనకు పాల్పడిన క్రిమినల్స్ కి మరణ శిక్ష విధించాలని కోరారు. బాధితురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: EVExpo: ఎలక్ట్రిక్ వెహికల్ ఎగ్జిబిషన్.. ఈ నెల 6 నుంచి.. అతిపెద్ద ఈ ఈవెంట్ ఎక్కడ ఎలా నిర్వహించబోతున్నారంటే..
Gehana Vasisth: ‘గందీ బాత్’.. నగ్నంగా లైవ్‌లోకి వచ్చిన హీరోయిన్.. షాక్ అయిన నెటిజన్లు..