Delhi Metro: ఇకనుంచి అలాంటి దుస్తులు ధరించవద్దు.. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక ప్రకటన
ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బికినీ టైప్ దుస్తులు ధరించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. దీనిపై స్పందించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ కీలక ప్రకటన జారీ చేసింది.

ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బికినీ టైప్ దుస్తులు ధరించిన వీడియో సోషల్ మీడియాలో వైరలయ్యింది. దీనిపై స్పందించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ కీలక ప్రకటన జారీ చేసింది. ఇకనుంచి మెట్రో లాంటి ప్రజా రవాణా చేసే ప్రయాణికులు ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రయాణికులు ఇతరులకు అసౌకర్యంగా అనిపించే దుస్తులు వేసుకోవద్దని సూచించింది. తోటి ప్రయాణికులు సున్నితత్వాన్ని కించపరిచేలా ఉండే దుస్తులు ధరించవద్దని పేర్కొంది. దుస్తుల ఎంపిక వ్యక్తిగత విషయమే అయినప్పటికీ ప్రయాణికులు బాధ్యతాయుతంగా స్వీయ నియంత్రణలో ఉండాలని సూచించింది. ఎవరైన నిబంధనలను ఉల్లంఘించి అసభ్యంగా ప్రవర్తిస్తే సెక్షన్ 59 ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించింది.
రిథమ్ చననా అనే యువతి ఢిల్లీ మెట్రో బికిని దుస్తులు వెసుకొని తోటి ప్రయాణికులను బిత్తరపోయేలా చేసింది. సోషల్ మీడియాలో ఈమెపై నెటీజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే వీటిపై స్పందించిన రిథమ్ చననా తనది పద్దతి గల కుటుంబమని..మొదట్లో తాను కూడా పద్ధతిగా ఉండేదాన్నని చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత ఆలోచనలు మారాయని..ఇంట్లో వాళ్లు అంగీకరించకపోవడంతో దూరంగా ఉంటూ వస్తున్నానని తెలిపింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం..




