BBC Documentary: ప్రధాని మోడీపై డాక్యుమెంటరీ.. బీబీసీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు..
2022 గుజరాత్ అల్లర్లకు సంబంధించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశించి బీబీసీ తీసిన డాక్యుమెంటరీ సిరీస్ కలకలం రేపిన విషయం తెలిసిందే. 'ఇండియా: ది మోడీ క్వశ్చన్' ప్రధాని మోడీని కించపరిచే విధంగా ఉందంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ సిరీస్ పై నిషేధం విధించింది.
2022 గుజరాత్ అల్లర్లకు సంబంధించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశించి బీబీసీ తీసిన డాక్యుమెంటరీ సిరీస్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ ప్రధాని మోడీని కించపరిచే విధంగా ఉందంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ సిరీస్ పై నిషేధం విధించింది. అయితే, వివాదాస్పద డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ సిరీస్.. ప్రధానమంత్రి, భారత న్యాయవ్యవస్థను కించపరిచే ప్రయత్నమని దావా వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం బ్రిటిష్ బ్రాడ్‌కాస్ట్ కంపెనీ (బిబిసి)కి సమన్లు జారీ చేసింది. దీనిపై పూర్తి ఆధారాలను సమర్పించాలని బీబీసీని ఆదేశించిన ధర్మాసనం.. విచారణను సెప్టెంబర్‌కు వాయిదా వేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ప్రధాని మోడీ.. సీఎంగా ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని సవాల్ చేస్తూ బీబీసీ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీనిలో పలు కీలక విషయాలను ప్రస్తావించింది. అయితే, బీబీసీ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత.. ఫిబ్రవరిలో ఢిల్లీ, ముంబైలోని BBC కార్యాలయాలను ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ..”ఇండియా: ది మోడీ క్వశ్చన్” పేరిట తీసిన సిరీస్ ను ఇప్పటికే కేంద్రం సహా.. పలు సంస్థలు, అధికారులు తప్పుబట్టాయి. ఈ సిరీస్‌లో 2002 గుజరాత్ అల్లర్ల ఘటనకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అయినప్పటికీ.. బీబీసీ మాత్రం అందుకు విరుద్ధంగా సిరీస్ లో ఘటనలు పొందుపరచడం ఆగ్రహానికి కారణమైంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..