Shaktikanta Das: లక్ష్యం నెరవేరింది.. అందుకే రూ.2వేల నోటు ఉపసంహరించుకున్నాం: ఆర్బీఐ గవర్నర్‌

రూ.2వేల నోట్లు ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అనుకున్న లక్ష్యం నెరవేరిందంటూ పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఉపశమనం కోసమే రూ.2వేల నోటు తీసుకువచ్చామని.. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరింది.. అందుకే ఉపసంహరించుకుంటున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

Shaktikanta Das: లక్ష్యం నెరవేరింది.. అందుకే రూ.2వేల నోటు ఉపసంహరించుకున్నాం: ఆర్బీఐ గవర్నర్‌
Shaktikanta Das
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 22, 2023 | 1:33 PM

రూ.2వేల నోట్లు ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అనుకున్న లక్ష్యం నెరవేరిందంటూ పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఉపశమనం కోసమే రూ.2వేల నోటు తీసుకువచ్చామని.. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరింది.. అందుకే ఉపసంహరించుకుంటున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రూ.2వేల స్థానంలో ఇప్పుడు సరిపడా నోట్లు ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో వెయ్యి నోటు తెచ్చే యోచన కూడా లేదని శక్తికాంత దాస్ తెలిపారు. ఈలోగా ఎన్ని నోట్ల మార్పిడి, డిపాజిట్లు జరుగుతున్నాయో బ్యాంక్‌లు ఆర్బీఐకి చెప్పాల్సిందేని శక్తికాంత దాస్ స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు. 50వేల విలువ దాటిన నోట్ల మార్పిడి, డిపాజిట్‌కి పాన్‌కార్డ్ తప్పనిసరని శక్తికాంతదాస్ తెలిపారు. నోట్ల మార్పిడి వ్యవహారంలో ఆర్బీఐ జోక్యం చేసుకోదన్నారు. ఇతర ఏజెన్సీల ప్రమేయంతో ఆర్బీఐకి సంబంధం లేదని స్పష్టంచేశారు. సెప్టెంబర్ 30లోపు అన్ని నోట్లు వెనక్కి వస్తాయని ఆశిస్తున్నామని.. ఒకవేళ రాకపోతే ఏం చెయ్యాలనేది అప్పుడు ఆలోచన చేస్తామని శక్తికాంత దాస్ వెల్లడించారు.

రూ.2,000 నోట్ల మార్పిడికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే బ్యాంకులకు సూచించామని శక్తికాంత దాస్ చెప్పారు. RBI క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ. 2,000 నోటును చెలామణి నుంచి ఉపసంహరించుకున్నామని.. రూ. 2,000 నోట్లను మార్చుకోవడంలో లేదా డిపాజిట్ చేయడంలో ప్రజలు ఎదుర్కొనే అన్ని ఇబ్బందులకు తాము సున్నితంగా వ్యవహరిస్తామన్నారు. విదేశాలలో ఉన్న భారతీయులతో సహా ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నాని ప్రకటించారు. భారత కరెన్సీ నిర్వహణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని, రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తక్కువగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

సెంట్రల్ బ్యాంక్ వద్ద ఇప్పటికే ముద్రించిన నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, ఇంతకుముందు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం రూ. రెండు వేల నోట్లను మార్చుకోవచ్చని శక్తికాంతదాస్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..