Two-Wheeler Ban: వాహనదారులకు బిగ్ అలర్ట్.. 2028 నుంచి ఆ బైక్స్ రిజిస్ట్రేషన్స్ బంద్!
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ పెరిగిపోతున్న వాయు కాలుష్యం దృష్టా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నగరంలో కాలుష్యాన్ని తగ్గేందుకు పెట్రోల్‌తో నడిచే టూ-వీలర్ల వినియోగాన్ని దశలవారీగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. వాటి స్థానంలో సరికొత్త ఈవీ పాలసీ తీసుకురానున్నట్టు పేర్కొంది. ఈ మేరకు శనివారం ఢిల్లీ EV పాలసీ 2026-2030' ముసాయిదాను విడుదల చేసింది

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నగరంలో పెట్రోల్ టూవీలర్ వాహనాల వాడకాన్ని నిషేదించనున్నట్టు పేర్కొంది.ఈ మేరకు శనివారం ఓ ముసాయిదను కూడా రిలీజ్ చేసింది. దీని ప్రకారం.. 2027 నుండి కొత్త పెట్రోల్ లేదా సీఎన్‌జీ ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్లు, 2028 నుండి కొత్త పెట్రోల్ టూ-వీలర్ల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేయనున్నట్టు తెలిపింది. అప్పటి నుండి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది.
2030 నాటికి ఢిల్లీని పూర్తిస్థాయి ఈవీ నగరంగా మార్చడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించినట్టు పేర్కొంది. ఇందులో భాగంగానే త్వరలో 30శాతం పాఠశాల బస్సులు ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ విభాగాల్లోని వాహనాలను కూడా క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనున్నట్టు తెలిపారు. అంతేకాదు ఈవీ వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా అందించనున్నట్టు ముసాయిదాలో పేర్కొంది.
కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు
జనాలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ రాయితీలను సైతం ప్రకటించింది. బ్యాటరీ సామర్థ్యం ఆధారంగా ప్రభుత్వం జనాలకు రాయితీలను అందించనుంది. తొలి సంవత్సరంలో ఎలక్ట్రిక్ టూవీలర్ కొనే వారికి రూ.30,000 వరకు ప్రోత్సాహకం అందించనున్నారు. రెండో ఏడాది కొనేవారికి రూ. 20,000, మూడో ఏడాదిలో రూ.10,000 వేల వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. వీటితో పాటు ఈ వాహనాలకు రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపు కల్పించనున్నారు.
పాత వాహనాల తొలగింపు
ప్రజలకు మరో బెనిఫిట్ ఏమిటంటే పాత వాహనాలను మార్చి కొత్త ఈవీలను తీసుకునే వారికి అదనంగా మరో 10వేల వరకు సబ్సిడీ అందించనున్నారు. అంతే కాదు ప్రతి ఈవీ డీలర్ వద్ద పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇళ్ల వద్దనే ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
