Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liquor Scam Case: మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ.. కస్టడీకి అప్పగింత..

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను పక్కన పెట్టిన రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయనకు ఐదు రోజుల సీబీఐ...

Liquor Scam Case: మనీష్ సిసోడియాకు ఎదురుదెబ్బ.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ.. కస్టడీకి అప్పగింత..
Manish Sisodia
Ganesh Mudavath
|

Updated on: Feb 27, 2023 | 6:22 PM

Share

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ను పక్కన పెట్టిన రౌస్‌ అవెన్యూ కోర్టు ఆయనకు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. మార్చి 4వ తేదీ వరకు సిసోడియా సీబీఐ కస్టడీలో ఉంటారు. తాము అడిగిన ప్రశ్నలకు సిసోడియా జవాబులు దాట వేశారని, ఆయన్ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఆయనకు రిమాండ్‌ విధించారు. సిసోడియా రిమాండ్‌పై కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. సీబీఐ ఇప్పటికే ఆయన ఇంట్లో పలుమార్లు తనిఖీలు చేసిందని , ఎలక్ట్రానిక్‌ వస్తువులను స్వాధీనం చేసుకుందని సిసోడియా తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సిసోడియాను ఇంకా విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.

మరోవైపు.. సిసోడియా అరెస్ట్‌ను నిరసిస్తూ ఆప్‌ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో ఆప్‌ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వందలాదిమంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా.. ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటు చేసుకున్న వ్యవహారంపై సిసోదియాను ఆదివారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్లాలంటే ఆయనను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది.

కాగా.. ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేసింది. సీబీఐ 8 గంటల పాటు విచారించింది. ఆ తరువాత అరెస్ట్‌ చేసింది. లిక్కర్‌ పాలసీని రూపొందించడంలో సిసోడియా కీలక పాత్ర పోషించారు. అయితే, స్కామ్‌కి సంబంధించి బ్యూరోక్రాట్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. లిక్కర్ వ్యాపారులు, సౌత్ గ్రూపు నుంచి ముడుపులు తీసుకున్న విజయ్ నాయర్.. ఆ ముడుపుల్లో కొంత భాగం గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్టు చార్జిషీట్లో వెల్లడించారు. సీఎం కేజ్రీవాల్‌ సైతం ఫేస్ టైమ్‌లో లిక్కర్ సిండికేట్ వ్యాపారులతో మాట్లాడినట్టు దర్యాప్తు సంస్థలు చార్జిషీట్ లో పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..