Watch: పెళ్లి బృందంపై హోటల్ సిబ్బంది దాడి.. బౌన్సర్లతో కొట్టించారు.. మరీ ఇంత దారుణమా..?
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు సైతం హోటల్ సిబ్బంది, నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఓ పెళ్లి తంతు మూడు తన్నులు, ఆరు పిడిగుద్దులుగా మారింది. సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుక కాస్త గొడవలు, ఘర్షణకు దారితీసింది. సూరి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం ఒక హోటల్‌లో పెళ్లి వేడుక నిర్వహించింది. దీని కోసం గోవింద్ పురిలో ఉన్న గ్రాండ్ ఐరిస్ హోటల్ బుక్ చేసుకుంది వరుడి తరఫు కుటుంబం. శనివారం సాయంత్రం అక్కడి హోటల్‌లో మెహిందీ వేడుక నిర్వహించారు. అయితే, హోటల్‌లో డీజేను అర్ధరాత్రి 02.00 గంటలకు ఆపేశారు హోటల్ సిబ్బంది. దీనిపై పెళ్లికి వచ్చిన అతిథులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొంతసేపు డీజే పెట్టమని చెప్పారు. దీనికి హోటల్ సిబ్బంది నిరాకరించారు. ఈ క్రమంలో హోటల్ సిబ్బందికి, అతిథులకు మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది.
ఇరువురి మధ్య మొదలైన ఈ గొడవ పెద్దదైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. హోటల్ సిబ్బంది, బౌన్సర్లు కలిసి వరుడితోపాటు, అతడి బంధువులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీనిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టుగా తెలిసింది.. మరి కొందరు పరారీలో ఉండటంతో వారి కోసం వెతుకుతున్నారు.
उप्र में भाजपा ने क़ानून-व्यवस्था का अंतिम संस्कार कर दिया है। pic.twitter.com/Z4vrY70PBd
— Akhilesh Yadav (@yadavakhilesh) February 26, 2023
పరస్పర దాడి ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని, ఆమెను ఐసీయూలో చేర్చామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు సైతం హోటల్ సిబ్బంది, నిర్వాహకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..