AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: కారుపై హుక్కా కొడుతూ యువకుడి హంగామా.. కట్‌ చేస్తే చిచ్చాకు కళ్లు బైర్లు కమ్మే ట్విస్ట్‌.

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరూ పాపులర్‌ అవ్వాలని చూస్తున్నారు. ఎలాగైనా రాత్రిరాత్రికి సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నారు. దీంతో క్షణాల్లో వైరల్‌ అయ్యేలా వీడియోలను రూపొందిస్తున్నారు...

Watch Video: కారుపై హుక్కా కొడుతూ యువకుడి హంగామా.. కట్‌ చేస్తే చిచ్చాకు కళ్లు బైర్లు కమ్మే ట్విస్ట్‌.
Narender Vaitla
|

Updated on: Feb 27, 2023 | 8:12 PM

Share

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరూ పాపులర్‌ అవ్వాలని చూస్తున్నారు. ఎలాగైనా రాత్రిరాత్రికి సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నారు. దీంతో క్షణాల్లో వైరల్‌ అయ్యేలా వీడియోలను రూపొందిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో నెట్టింట నిలవాలని చూస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుర్రాడు ఇలాగే ఓవర్‌ నైట్‌లో సెలబ్రిటీ అవ్వాలనుకున్నాడు. అయితే ఆ యువకుడికి చివరల్లో ఊహించని షాక్‌ ఎదురైంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన రజా అహ్మద్‌ అనే యువకుడు సోషల్‌ మీడియాలో సెలబ్రిటీ అవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా కానా స్టేడియంలో కారుపై నిల్చొని హుక్కా కొడుతూ వీడియో తీశాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో కాస్త అటు తిరిగి, ఇటు తిరిగి పోలీసుల కంట పడింది.

ఇవి కూడా చదవండి

ఇంకేముంది ఆ యువకుడిని పట్టుకునేందుకు వెంటనే రంగలోకి దిగారు పోలీసులు. వీడియోలో కనిపిస్తోన్న కారు నెంబర్‌ ఆధారంగా యువకుడిని గుర్తించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రూ. 7500 జరిమానా విధించి కారును కూడా సీజ్‌ చేశారు. ఇలా చట్ట విరుద్ధంగా ఎవరూ వ్యవహరించినా రియాక్షన్‌ ఇలాగే ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియోను లక్నో పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌